చిరుతో ఉయ్యాల‌వాడ వార‌సుల భేటీ…

-

మెగాస్టార్ చిరంజీవి.. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటించిన సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌లో రామ్ చరణ్ నిర్మించాడు. వ‌చ్చే అక్టోబ‌ర్ 2వ తేదీన గాంధీజ‌యంతి సంద‌ర్భంగా ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఇక ఈ సినిమా షూటింగ్‌కు ముందు త‌మ‌ను అన్ని విధాలా వాడుకున్నార‌ని… ఉయ్యాల‌వాడ‌కు సంబంధించి త‌మ వ‌ద్ద అనేక విషయాలు తెలుసుకున్నార‌ని… త‌మ‌ను ఆర్థికంగా వాడుకుంటామ‌ని ఇప్పుడు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని కొద్ది రోజులుగా ఉయ్యాల‌వాడ కుటుంబీకులు తీవ్ర ఆందోళ‌న‌లు చేస్తున్నార‌ని… తమకు న్యాయం చేయాలంటూ జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి కార్యాలయం ముందు ధర్నా చేసారు.

ఇక ఉయ్యాల‌వాడ వార‌సులు ఈ సినిమాపై కోర్టులో కేసు కూడా వేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే క‌ర్నూలు జిల్లా ఉయ్యాల‌వాడ మండ‌లం రూపనగుడి గ్రామానికి చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంశస్థులు కొంతమంది సినీ నటుడు చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఉయ్యాల‌వాడ చ‌రిత్ర‌ను సినిమాగా తెర‌కెక్కించి.. రేనాటి ప్ర‌తిష్ట పెంచిన చిరంజీవికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ క్ర‌మంలోనే చిరును కర్నాటి వంశస్థులు తమ ఆనందాన్ని చిరుతో పంచుకున్నారు.

త్వ‌ర‌లోనే జుర్రేరు,కుందూ నదులు కలిసే ప్రదేశంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్మృతి వనం ప్రారంభం కానుంద‌ని… ఈ కార్య‌క్ర‌మానికి రావాల‌ని వారు ఆహ్వానించ‌గా… చిరు అందుకు అంగీక‌రించారు. ఏదేమైనా సైరాపై కొద్ది రోజులుగా ఉయ్యాల‌వాడ కుటుంబీకులు చేస్తోన్న ఆందోళ‌న‌కు ఎట్ట‌కేల‌కు తెర‌ప‌డిన‌ట్టే తెలుస్తోంది. ఉయ్యాల‌వాడ కుటుంబీకులు స్వ‌యంగా చిరును క‌ల‌వ‌డంతో వారు సంతృప్తి చెంది… సైరా రిలీజ్‌కు స‌హ‌క‌రించేందుకు ముందుకు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం.

Read more RELATED
Recommended to you

Latest news