చాట్‌జీపీటీ వస్తే ఈ 20 ఉద్యోగాలు పోతాయి..!

-

టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతోంది. రోజు రోజుకీ ఎన్నో మార్పులు వచ్చేస్తున్నాయి. ఇది వరకు లైబ్రరీ, బుక్స్ ఇలా ఉండేది. కానీ ఇప్పుడు అంతా ఇంటర్నెట్ లోనే…. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా దీని గురించే ఇప్పుడు అంతా కూడా మాట్లాడుకుంటున్నాం. గతం లోనే చాట్‌జీపీటీని మార్కెట్లోకి లాంచ్ చేశారు.

ఇది స్క్రిప్ట్ రాయడం, స్టోరీలు, పద్యాలు వంటివి రాసేందుకు సహాయం చేస్తుంది. కొత్త ఉద్యోగాలు దీని మూలంగా వచ్చేసినా పాత ఉద్యోగాలను రిస్క్‌ లోకి పెట్టేస్తాయి. 2013లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఓ సర్వ్ చేసింది. 20 ఏళ్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 47 శాతం ఉద్యోగాలను లాక్కుంటుంది అని దాని ద్వారా అప్పుడే కనిపెట్టారు.

ఇప్పటికే కొన్ని దేశాలలో ఉద్యోగులను తొలగించి వారి స్థానంలో ఏఐ చాట్‌బాట్లను తీసుకు రావడం జరిగింది. ఫ్యూచర్ లో భారత్ వంటి దేశాల్లో నిరుద్యోగం భారీగా పెరిగిపోతుందని తెలుస్తోంది. ఏఐ చాట్‌బాట్ల వల్ల ఏయే ఉద్యోగాలు రిస్క్ లో పడతాయి అనేది ఇప్పుడు మనం చూసేద్దాం.

ఏఐ రాబోయే రోజుల్లో ప్రోగ్రామింగ్ అండ్ కోడింగ్ చేస్తుందట. ఇప్పుడు వీటికి బాగా డిమాండ్ వున్నా విషయం తెలిసిందే. మనుషుల కన్నా వేగంగా ఏఐ చాట్‌బాట్స్ కోడింగ్‌ను రాయగలవట.
ఎలాంటి టాపిక్ ఇచ్చినా ఆర్టికల్స్ రాయగలదు ఈ చాట్‌జీపీటీ. వేగంగా స్క్రిప్ట్ రాయగలదు. మనుషుల కన్నా కూడా. ఇదే వస్తే అడ్వర్టైజింగ్, టెక్నికల్ రైటింగ్, జర్నలిజం, కంటెంట్ క్రియేషన్ వంటి పోస్టులు చేస్తున్న వాళ్లకి ఇబ్బందే. కానీ సినిమాలకు రాసే స్క్రిప్ట్స్‌ను రాయలేవు. రిపోర్టర్లు, న్యూస్ క్యాస్టర్స్ వాళ్ళకి ఇబ్బందే.
లీగల్ ఇండస్ట్రీలో లీగల్ అసిస్టెంట్స్ డ్యూటీ చేయగలవు ఇవి. కానీ లాయర్ కావాలంటే మాత్రం మానవ తీర్పు, డిగ్రీ ఉండాలి. ఏఐ వచ్చినా కుదరదు.
జీపీటీ 4 ద్వారా ఇంగ్లీష్ టీచర్లు, టెలీమార్కెటర్స్, ప్రూఫ్‌రీడర్స్ వంటి పోస్టులకి రిస్క్ తప్పదు.
జీపీటీ వలన వర్చువల్ అసిస్టెంట్, న్యూర్ రిపోర్టర్, ట్రాన్స్‌స్క్రిప్షనిస్ట్, ఈమెయిల్ మార్కెటర్, ట్యూటర్ టెక్నికల్ సపోర్ట్ అనలిస్ట్, రిక్రూటర్, కంటెంట్ మోడరేటర్, ట్రావెల్ ఏజెంట్ వాళ్ళకి రిస్క్ ఏ.
డేటా ఎంట్రీ క్లర్క్, కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటీవ్, ప్రూఫ్‌రీడర్, పారా లీగల్, ట్రాన్స్‌లేటర్, బుక్‌ కీపర్, మార్కెట్ రీసెర్చ్, కాపీ రైటర్, సోషల్ మీడియా మేనేజర్, అనలిస్ట్, టెలీ మార్కెటర్, అపాయింట్మెంట్ షెడ్యూలర్ వాళ్లకి కూడా రిస్క్ ఏ.

Read more RELATED
Recommended to you

Latest news