సమాధిపై క్యూ ఆర్‌కోడ్‌.. వైరల్‌ అవుతున్న కాన్సప్ట్‌..

-

చనిపోయిన వారి సమాధులపై వారి పేరు పుట్టిన తేదీ, చనిపోయిన తేదీ రాస్తారు. ఇంటి పేరు రాస్తారు. మహా అయితే వారి ఫోటో కూడా ఒకటి చిన్నది ఉంటుంది. ఇంతకు మించి సమాధులపై ఇంకే ఉండవు కాదా..కానీ ఓ వ్యక్తి సమాధిపై క్యూర్‌ కోడ్‌ పెట్టాడు.. మనకు తెలిసి క్యూఆర్‌ కోడ్‌ను డబ్బులు పంపించడానికి మాత్రమే స్కాన్‌ చేస్తాం.. కానీ సమాధిపై క్యూఆర్‌ కోడ్‌ ఎందుకు పెట్టాడు.. అంటే సమాది చూడ్డానికి వచ్చిన వాళ్లు..క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి డబ్బులు కట్టాలా..? అసలేంటీ కాన్సప్ట్‌..

అతనో టెక్ సవ్వీ. టాలెంట్స్ అతని సొంతం. కానీ సడెన్‌గా ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయాడు. అతను లేని లోటును మర్చిపోలేకపోతున్న కుటుంబ సభ్యులు.. అదే టెక్నాలజీతో అతని జ్ఞాపకాల్ని సజీవంగా ఉంచేందుకు ప్రయత్నించారు.. ఆ ప్రయ్తనంలో భాగమే..సమాధిపై QR కోడ్ సెట్ చెయ్యడం.. ఇప్పుడు ఇది చర్చనీయాంశం అయ్యింది.

అతని పేరు ఎవిన్ ఫ్రాన్సిస్ (Evin Francis). కేరళలోని త్రిచూర్‌లో ఉంటాడు.. చదువులోనే కాదు.. ఫొటోగ్రఫీ, కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, డీకోడింగ్ ఇలా అతనికి చాలా టాలెంట్స్ ఉన్నాయి. అంతేకాదు.. డ్రమ్స్, గిటార్, కీబోర్ట్ ప్లే చేస్తాడు.. మల్టీ టాలెంటెడ్ కావడంతో… అతను ఎక్కడున్నా ఏదో తెలియని ఆనందం చుట్టుపక్కల వారికి ఉంటుంది.. అలాంటి ఎవిన్.. 26 ఏళ్ల వయసులో ఈ ప్రపంచాన్ని వీడి.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. దాంతో ఆ ఫ్యామిలీ కన్నీటి సంద్రంలో మనిగిపోయింది.

త్రిచూర్‌లోని వట్టాకుజీకి చెందిన ఫ్రాన్సిస్ కొడుకు ఎవిన్. కొడుకు దూరమవ్వడంతో.. తండ్రి తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు, బంధువులకు ఓ ఐడియా వచ్చింది. ఎవిన్ జ్ఞాపకాలను డిజిటల్ రూపంలో చూపిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించారు. ఎవిన్ సమాధిపై ఓ QR కోడ్‌ను సెట్ చేశారు. ఇప్పుడు ఎవరైనా ఆ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే.. వెంటనే మొబైల్‌లో ఎవిన్ కనిపిస్తాడు. అతని పాటలు, వీడియోస్ సందడి చేస్తాయి. ఎవిన్ సోదరి అయిన ఎవ్లిన్.. ఒమన్‌లో ఆర్కిటెక్ట్. ఆమే ఈ ఏర్పాటు చేసింది.

ఎవిన్.. మెడికల్ డిగ్రీ సంపాదించాక.. ప్రాక్టీస్ ప్రారంభించాడు. 2021 డిసెంబర్ 22న షటిల్ కోర్టులో బ్యాడ్మింటన్ ఆడుతూ సడెన్‌గా కుప్పకూలాడు. ప్రాణాలు విడిచాడు. ఇప్పుడు ఆ క్యూఆర్ కోడే.. ఆ కుటుంబానికి అతని జ్ఞాపకాల్ని డిజిటల్ రూపంలో చూపిస్తోంది. బాగుంది కూదా ఐడియా..!

Read more RELATED
Recommended to you

Latest news