తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో మరోసారి తన సత్తా చాటుతోంది. టైటిల్‌ను నిలబెట్టుకునే దిశగా ఈ తెలంగాణ పిల్ల మరో అడుగు ముందుకేసింది. మంగళవారం జరిగిన 50 కేజీల ప్రీక్వార్టర్స్‌లో ఆమె 5-0తో ప్యాట్రిసియా అల్వరెజ్ (మెక్సికో)ను చిత్తు చేసింది. ఆరంభం నుంచి పంచ్ పవర్ చూపించిన నిఖత్.. ప్రత్యర్థి ప్యాట్రిసియాకు అవకాశమే ఇవ్వలేదు. ప్రతి రౌండ్లోనూ న్యాయ నిర్ణేతలంతా నిఖత్కే ఓటేయడంతో ఆమె ఘన విజయాన్ని అందుకుంది.
ఆదివారం దిల్లీలోని కేడీ జాదవ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్రికన్ ఛాంపియన్ అల్జీరియాకు చెందిన బౌలమ్ రౌమైసాతో తలపడింది నిఖత్. 5-0 ఏకపక్ష స్కోర్‌తో ప్రత్యర్థిని ఓడించి ప్రీ-క్వార్టర్స్ ఆడింది. మ్యాచ్ ఆరంభంలో బాక్సర్లు ఇద్దరూ ఎంతో ఆచితూచి జాగ్రత్తగా ఆడారు. అయితే ఆట మొదటి రౌండ్లో నిఖత్‌కు తన ఆటతీరుతో విజృంభించింది. దీంతో ఆ రౌండ్ ఆమెకు అనుకూలంగా మారినట్లయింది. చివరకు 5-0తో వార్ వన్ సైడ్ చేసి విజేతగా నిలిచింది నిఖత్ జరీన్.