Priyanka : మలేసియాలోని గుడిలో సీరియల్ నటి ప్రియాంక సీక్రెట్ వెడ్డింగ్

-

బుల్లితెర నటి ప్రియాంక నల్కారి తన ప్రియుడు రాహుల్​తో గురువారం రోజున వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. మలేసియాలోని మురుగన్​ గుడిలో సింపుల్​గా వివాహం చేసుకుంది. ఈ విషయాన్ని ఇన్​స్టా ద్వారా తన అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ ఫొటోలు చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్​కు గురయ్యారు.

ప్రియాంక తెలుగుతో పాటు తమిళంలోనూ తన నటనతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం తెలుగు తెరకు దూరమై.. తమిళ సీరియల్స్ లో బిజీ అయిపోయింది. అక్కడ తాను నటించిన సీరియల్స్ హిట్ అవ్వడంతో ప్రజెంట్ ఈ బ్యూటీ చెన్నైలోనే సెటిల్ అయింది.

ఇక ప్రియాంక రాహుల్ అనే బిజినెస్ మేన్ తో 2018లో ఎంగేజ్ మెంట్ చేసుకుంది. చివరకు గురువారం రోజున ఈ ఇద్దరు ఓ గుడిలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. రాహుల్ కూడా కొన్ని సీరియల్స్ లో నటించాడు. ఆ క్రమంలోనే ఇద్దరికీ పరిచయమై.. అది కాస్త ప్రేమకు దారి తీసిందట. ఈ జంటకు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రియాంకా షాక్ ఇచ్చినా.. చాలా సర్ ప్రైజింగ్ గా ఉందని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news