ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. వైయస్సార్ ఆసరా మూడో విడత కింద 78 లక్షల మంది డ్రాక్వా మహిళల ఖాతాల్లో ఏకంగా 6400 కోట్ల రూపాయలను సీఎం జగన్మోహన్ రెడ్డి జమ చేయనున్నారు.
ఈ కార్యక్రమానికి ఈనెల 25వ తేదీన అంటే రేపే ముహూర్తం ఫిక్స్ చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈనెల 25వ తేదీన ఏలూరు జిల్లా దెందలూరు లో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఏప్రిల్ 5వ తేదీ వరకు అన్ని నియోజకవర్గాలలో ఆయా ఎంపీ మరియు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. 2019 ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు.. ఈ వైయస్సార్ ఆసరా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇందులో భాగం గానే ఇప్పటికే రెండు విడతల్లో వారి వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసింది ఏపీ ప్రభుత్వం.