చాలామంది ఇళ్లల్లో మనీ ప్లాంట్ను పెంచుకుంటారు. ఇది ఎంత బాగా పెరిగితే ఆ ఇంట్లోకి మనీ అంత బాగా వస్తుందని అందరి నమ్మకం. పైగా మనీ ప్లాంట్ వల్ల ఇల్లు చల్లగా ఉంటుంది. చూసేందుకు కూడా అందంగా కనిపిస్తుంది. అసలు నిజంగా మనీ ప్లాంట్ను పెంచుకోవడం వల్ల సంపద కలుగుతుందా..? ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం..!
అదృష్ట మొక్కలుగా భావించే మొక్కల్లో మనీ ప్లాంట్ మొక్క కూడా ఒకటి. ఈ మొక్కను ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ పెంచుతున్నారు. ఈ మొక్క మన మన చుట్టూ ఉండే నెగెటివ్ ఎనర్జీని గ్రహించి పాజిటివ్ ఎనర్జీని బయటకు విడుదల చేస్తుంది. దీని వల్ల ఆ ఇంట్లో ఉండే వాళ్లకు మనకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. అంతేకాకుండా మనీప్లాంట్ మొక్క ఇంట్లో ఉండడం వల్ల సంపద కలుగుతుంది. ధనాన్ని ఆకర్షించేశక్తి ఈ మొక్కకు ఉందని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. మనీ ప్లాంట్ వల్ల ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో దానిని సరైన దిక్కున ఉంచకపోవడం వల్ల కూడా అన్నే దుష్ప్రభావాలు కూడా కలుగుతాయనేది గుర్తుపెట్టుకోండి..
మనీ ప్లాంట్ను ఏ దిక్కులో పెట్టుకోవాలి..?
మనీప్లాంట్ను మన ఇంట్లో ఈశాన్య దిక్కున ఉంచడం వల్ల రావల్సిన డబ్బులు రాకపోగా ఇంట్లో ఉన్న డబ్బు కూడా బయటకు పోతుంది. ఇంట్లోని వారికి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.
మొక్క కనుక పడమర దిక్కులో ఉంటే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు, గొడవలు వస్తాయి. మనీ ప్లాంట్ మొక్కను మన ఇంట్లో తూర్పు, ఉత్తరం, దక్షిణ దిక్కులో పెంచుకోవడం వల్ల మాత్రమే మనం మంచి ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇంటికి ఆగ్నేయం మూలన పెంచుకోవడం వల్ల కూడా మనకు మేలు కలుగుతుంది. ఆగ్నేయ మూల వినాయకుడికి ఎంతో ఇష్టమైన మూల. కాబట్టి ఈ మూలన మనీప్లాంట్ ను పెంచుకోవడం వల్ల మనం వినాయకుడి అనుగ్రహాన్ని పొందగలం.
తూర్పు ఆగ్నేయంగా ఈ మొక్కను కుండీలో కానీ, వేలాడేలా కానీ పెంచుకోవాలి. అలాగే ఈ మొక్కకు ప్రతిరోజూ నీళ్లు పోస్తూ, మంచి పోషణను ఇస్తూ పెంచాలి. దీంతో ఆగ్నేయ దిక్కున ఉండే గణపతి లక్ష్మీ గణపతిగా మారి మన ఇంట్లో ధనప్రాప్తి కలిగేలా చేస్తాడని పురాణాలు చెబుతున్నాయి.
మనీ ప్లాంట్ను కూడా పచ్చగా నిగనిగలాడుతూ ఉండేలా చూసుకోవాలి. గుబురుగా కాకుండా ఆకాశాన్ని చూస్తూ ఉండేలా తీగలాగా పెంచుకోవాలి. మనీప్లాంట్ దగ్గర ఎప్పుడూ చెడుగా మాట్లాడకూడదు. పండిపోయిన, పసుపు రంగులో మారిన ఆకులను తొలగించాలి. మన ఇంట్లో పెంచుకునే మనీప్లాంట్ మొక్క ఎంత పచ్చగా ఉంటే మన కుటుంబం కూడా అంతగా పచ్చగా ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇన్ని జాగ్రత్తలు పాటించే మనీ ప్లాంట్ను పెంచితేనే మీరు అనుకున్నది నెరవేరుతుంది.