ఎయిర్‌ ఇండియాలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేసుకోండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు ఇది గుడ్ న్యూస్. ఎయిర్‌ ఇండియాలో పలు పోస్టులు ఖాళీగా వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే… ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లో కొన్ని పోస్టులు ఖాళీ వున్నాయి. మొత్తం 145 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

ఈ పోస్టుల కి అప్లై చేసుకోవాలని అనుకునే వాళ్ళ వయస్సు 28 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. ఇక పోస్టుల వివరాలని చూస్తే.. జూనియర్‌ ఆఫీసర్‌ ప్యాసింజర్‌ (04), జూనియర్‌ ఆఫీసర్‌ టెక్నికల్‌ (02), కస్టమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌ (16), డ్యూటీ ఆఫీసర్‌ (01), యుటిలిటీ ఏజెంట్ అండ్ ర్యాంప్ డ్రైవర్ (06), హ్యాండీ మ్యాన్ (98) పోస్టులు వున్నాయి.

ఇక విద్యార్హత వివరాలు చూస్తే.. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10+2, ఐటీఐ, డిప్లొమా, ఎంబీఏ పూర్తి చేసి ఉండాలి. ఈ పోస్టుల కి అప్లై చేసుకోవాలని అనుకునే వాళ్ళు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఇంటర్వ్యూలు ని నిర్వహిస్తారు. పూర్తి వివరాలు ని మీరు http://www.aiasl.in/ లో చూడచ్చు.

 

Read more RELATED
Recommended to you

Latest news