ఇండియాలో క్రికెట్ దేవుడిగా ఆరాధించే సచిన్ టెండూల్కర్ కు ఒక కొడుకు ఉన్నాడు. లక్కీ గా అతను కూడా క్రికెట్ నే తన కెరీర్ గా ఎంచుకుని కష్టనష్టాలను ఎదుర్కొంటూ ఐపీఎల్ వరకు చేరుకున్నాడు. అయితే గత రెండు సీజన్ లుగా ముంబై ఇండియన్స్ డగ్ అవుట్ లో కూర్చుంటున్నా.. ఒక్క మ్యాచ్ లోనూ ఆడే అవకాశం దక్కలేదు , కానీ ఇటీవల అర్జున్ ప్రదర్శన చూస్తే కచ్చితంగా ఈసారి ఐపీఎల్ లో కీలక ప్లేయర్ గా మారే అవకాశాలు లేకపోలేదు.
ప్రస్తుతం ముంబై బౌలర్లుగా ఉన్న బుమ్రా మరియు రిచర్డ్సన్ లు గాయం కారణంగా దూరం కావడంతో బౌలర్ల కొరత ఏర్పడింది. దీనితో ముంబై బౌలింగ్ కోచ్ అర్జున్ ను తుది జట్టులోకి తీసుకోవడానికి ప్లాన్ చేస్తున్నారట. ఒకవేళ అవకాశం దక్కితే ఆల్ రౌండర్ గా ఆకట్టుకుని జట్టు విజయాలలో కీలకంగా మారుతాడా లేదా పేలవ ప్రదర్శనతో ఒకటి రెండు మ్యాచ్ లేక్ పరిమితం అవుతాడా చూడాలి.