మా నాన్న చనిపోయాక రాహుల్ గాంధీ నాకు అండగా ఉన్నాడు: మాజీ ఎంపీ దివ్య

-

కన్నడ సినిమా పరిశ్రమకు చెందిన దివ్య స్పందన 2012 వ సంవత్సరంలో కాంగ్రెస్ లో చేరి మండ్య లోక్ సభ నుండి ఎంపీగా గెలిచింది. ఆ తర్వాత ఈమె ఎంపీగా ఓడిపోవడంతో మాజీ అయిపోయారు. ఇక తాజాగా ఈమె కన్నడ టీవీ షో లో పాల్గొని అందులో తన లైఫ్ లో జరిగిన ఒక విషయాన్నీ ప్రేక్షకులతో పంచుకున్నారు. గతంలో మా నాన్న చనిపోయిన సమయంలో నేను చాలా కుంగిపోయానని.. పరిస్థితులు అన్నీ నా చేయి దాటిపోయినాలు అనిపించిందని చెప్పుకు వచ్చింది.

ఇక నాన్న లేని లోటుతో సూసైడ్ చేసుకోవాలనుకున్నట్లు చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. ఆ కాస్త పరిస్థితుల్లో రాహుల్ గాంధీ నాకు మోరల్ సపోర్ట్ ఇవ్వడంతోనే నేను మళ్ళీ లైఫ్ లో రికవర్ అవ్వగలిగాను అంటూ చెప్పుకువచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news