సత్య సాయి జిల్లా పుట్టపర్తిలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. స్థానిక ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. నియోజకవర్గంలో అభివృద్ధి, అవినీతి ఆరోపణలపై బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కి సవాల్ విసిరారు. దీంతో పల్లె రఘునాథ్ రెడ్డి కూడా సత్యమ్మ గుడి దగ్గర ప్రమాణం చేసేందుకు సిద్ధమయ్యారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డిలు ఉదయం సత్యమ్మ దేవాలయానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. వైఎస్ఆర్సిపి, టిడిపి వర్గీయులు రాళ్లు, చెప్పులతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వాహనం ధ్వంసం అయింది. ఈ దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు. వైసీపీలో ఓటమి భయంతో ప్రస్టేషన్ కనిపిస్తుందన్నారు.
ట్విట్టర్ వేదికగా ఆయన స్పందిస్తూ.. ” పుట్టపర్తి లో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వాహనంపై, టిడిపి కార్యకర్తలపై వైసీపీ రౌడీలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రశ్నించిన ప్రతిపక్షాలపై ప్రతిరోజూ దాడులు సమాధానం కాలేవు. వైసిపి దాడుల వెనక వారి ఓటమి భయం కనిపిస్తుంది. ప్రజాస్వామ్యంలో దాడులకు తావులేదు. ఇది హేయమైన చర్య” అని పేర్కొన్నారు చంద్రబాబు.
పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్‌రెడ్డి వాహనం పై , టీడీపీ కార్యకర్తలపై వైసీపీ రౌడీలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రశ్నించిన ప్రతిపక్షాలపై ప్రతిరోజూ దాడులు సమాధానం కాలేవు. వైసీపీ దాడుల వెనుక వారి ఓటమి భయం, ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది. #YSRCPRowdyism pic.twitter.com/wGk0FRhwQ5
— N Chandrababu Naidu (@ncbn) April 1, 2023