రికార్డులు బ్రేక్ చేస్తున్న దసరా మూవీ.. ఎన్టీఆర్ ను క్రాస్ చేసిన నాని

-

నాచురల్ స్టార్ నాని నటించిన చిత్రం దసరా.. మార్చి 30న విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ సంపాదించి థియేటర్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది ఈ సినిమా.. ముఖ్యంగా ఈ చిత్రంలో నాని, కీర్తి సురేష్ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించి 100 కోట్ల వైపుగా పరుగులు తీస్తోంది. కాగా నాని ఈ సినిమాతో ఎన్టీఆర్ రికార్డును బద్దలు కొట్టినట్టు తెలుస్తుంది.

శ్రీకాంత్ వదల దర్శకత్వంలో వచ్చిన దసరా సినిమా తాజాగా విడుదలై మంచి ప్రేక్షకు ఆదరణ సంపాదించుకుంది కాగా ఈ సినిమా రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది. ఈ చిత్రంతో యూఎస్ లో మరొకసారి వన్ మిలియన్ డాలర్ అందుకున్న హీరోగా నిలిచాడు నాని. ఇప్పటివరకు నాని నటించిన ఏడు చిత్రాలు 1 మిలియన్ మార్కును దాటగా తాజాగా దసరా చిత్రం కూడా వన్ మిలియన్ డాలర్లు వసూళ్లు సాధించి ఈ ఘనత సాధించిన ఎనిమిదవ చిత్రంగా నాని కెరియర్లో నిలిచిపోయింది. ఈ చిత్రం వన్ మిలియన్ డాలర్ వసూళ్లను సాధించడంతో మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పటివరకు ఎన్టీఆర్ తో సమానంగా విదేశాల్లో ఏడు చిత్రాలు 1 మిలియన్ డాలర్ వసూలు చేయగా ఈ సినిమాతో ఎన్టీఆర్ ను క్రాస్ చేశారు నాని.

 

కాగా ఈ జాబితాలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ లో మొత్తంగా 11 చిత్రాలు వన్ మిలియన్ డాలర్లు వసూలు చేసి మొదటి స్థానంలో నిలిచారు. ఇప్పుడు ఆయన తర్వాత ఎన్టీఆర్ రికార్డును బ్రేక్ చేసి నాని రెండో స్థానంలో నిలవడంతో నాని కెరియర్ లోనే దసరా మూవీ బిగ్గెస్ట్ హిట్టుగా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news