BIG BREAKING: టెన్త్ పరీక్షల వాయిదాపై క్లారిటీ… పేరెంట్స్ ఖుషీ !

-

తెలంగాణ రాష్ట్రంలో ఉదయాన వాట్సాప్ గ్రూప్ లో ప్రత్యక్షము అయిన తెలుగు పేపర్ కథ ఎన్నో మలుపులు దారితీస్తోంది. వికారాబాద్ జిల్లాలోని తాండూరు లో ప్రభుత్వ పాఠశాలలో పరీక్ష నిర్వహించే ఇన్విజిలేటర్ పేపర్ ను ఫోటో తీసి వాట్సాప్ లో పెట్టడంతో గందరగోళం నెలకొంది. ఈ ఘటనకు కారణమైన నలుగురిని ఇప్పటికే విద్యాశాఖ సస్పెండ్ చేసింది. కాగా ఈ ఘటన పట్ల విద్యార్థుల తల్లితండ్రులు ఎక్కడ మిగిలిన పరీక్షకు రద్దు చేస్తారో మా పిల్లల భవిష్యత్తు ఏమవుతోందో అని ఆందోళన పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన ఒక స్పష్టమైన క్లారిటీ ఇవ్వడం జరిగింది.

షెడ్యూల్ ప్రకారం టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతాయని చెప్పింది. దీనిపైన ఏమీ అనుమానాలు పెట్టుకోవద్దు అంటూ విద్యార్థులకు మరియు వారి తల్లితండ్రులకు శుభవార్త చెప్పింది. ఈ పేపర్ లీక్ లో బాధ్యులు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని ఈమె ఇప్పటికే వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డికి ఆదేశాలిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news