ఏంటిది కేసీఆర్: వికారాబాద్ లో BRS లో అసమ్మతి సెగ… కార్యకర్తల తిరుగుబాటు !

-

మామూలుగా ఈ రాజకీయ పార్టీ అయినా అసమ్మతి నాయకులు ఉండనే ఉంటారు. అది అధికార పార్టీ అయినా.. ప్రతిపక్షం అయినా ఎందుకు మినహాయింపు కాదు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లాలో ఎన్నో రోజుల నుండి జరుగుతున్నా ఇప్పుడు బయటపడింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం జిల్లాలోని BRS నాయకులు అంతా కలిసి జిల్లా కేంద్రంలో మీటింగ్ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం వికారాబాద్ కు BRS అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పై వ్యతిరేకత వలన ఈ సమావేశం పెట్టినట్లు తెలుస్తోంది. వీరంతా కలిసి వచ్చే ఎన్నికల్లో మెతుకు ఆనంద్ ఓటమి కోసం పనిచేయనున్నారట. వీరు చెబుతున్న ప్రకారం జిల్లాలో గ్రూప్ రాజకీయాలకు సపోర్ట్ చేస్తున్నాడని, అర్హత లేని వారికి కూడా ప్రభుత్వం పథకాలను ఇస్తున్నారని అభియోగాలు ఉన్నాయి. ఇక తన పరిధిలో ఉన్న నామినేటెడ్ పోస్ట్ లను డబ్బుల కోసం అమ్ముకుంటున్నారని కూడా చెబుతున్నారు. మరి ఇది వికారాబాద్ లో BRS ను ముంచుతుందా ? దీనిపైన సీఎం కెసిఆర్ ఎటువంటి చర్యలు తీసుకుంటారు… అన్నది తెలియాల్సి ఉంది. ఈ విషయం పైన ఏంటిది కేసీఆర్ ను కొందరు విమర్శిస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news