IPL 2023: రాజస్థాన్ VS హైదరాబాద్ … టాస్ గెలిచిన SRH

-

ఐపిఎల్ 2023 మొదలు అప్పుడే మూడు మ్యాచ్ లు పూర్తి అయ్యాయి. జరిగిన మూడు మ్యాచ్ లు కూడా క్రికెట్ ప్రేమికులకు కావల్సినంత వినోదాన్ని పంచాయి అని చెప్పాలి. ఈ రోజు డబుల్ హెడర్ లో ముందుగా గత ఐపిఎల్ రన్నర్ అప్ రాజస్థాన్ రాయల్స్ తమ సొంత మైదానంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తో తలపడుతోంది . ఈ సీజన్ లో ఇద్దరికీ ఇదే తొలి మ్యాచ్ కావడంతో ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి.

రాజస్థాన్ రాయల్స్ కు కెప్టెన్ గా సంజు శాంసన్ వ్యవరిస్తుండగా… సన్ రైజర్స్ హైదరాబాద్ ను పేస్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ నడిపించనున్నాడు. ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన …… బౌలింగ్ ఎంచుకుంది. కానీ ఇప్పటి వరకు జరిగిన మూడు మ్యాచ్ లలో రెండు మ్యాచ్ లు చేజింగ్ లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. మరి ఈ నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అన్నది తెలియాలంటే మ్యాచ్ ముగిసే వరకు వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news