రాహుల్ గాంధీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన అనురాగ్ ఠాకూర్

-

కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, కాంగ్రెస్ అగ్రనేత అయిన రాహుల్ గాంధీ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీర సావర్కార్ ను అవమానించిన రాహుల్ గాంధీని దేశం ఎన్నటికీ క్షమించబోదని వెల్లడించారు మంత్రి అనురాగ్ ఠాకూర్. రాహుల్ గాంధీ ఇంకా 10 జన్మలెత్తినా కూడా సావర్కర్ కాలేడని హేళన చేశారు. సావర్కర్ తన జీవితాంతం స్వాతంత్ర్యం కోసం పోరాడితే, బ్రిటిష్ వాళ్ల సాయంతో రాహుల్ గాంధీ మాత్రం తన జీవితమంతా భారత ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పోరాడుతుంటాడని మండిపడ్డారు ఆయన. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం వద్ద జీతో అహింసా రన్ ప్రారంభోత్సవం సందర్భంగా అనురాగ్ ఠాకూర్ ఈ వ్యాఖ్యలు చేస్తూ తన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Anurag Thakur - Wikipedia

మోదీ అనే ఇంటి పేరును ఉద్దేశించి రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సూరత్ కోర్టు రెండేళ్ల జైలు అతనికి శిక్ష విధించింది. దాంతో పార్లమెంట సభ్యుడిగా ఆయనపై అనర్హత వేటు పడింది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ… “నా పేరు సావర్కర్ కాదు… నా పేరు రాహుల్ గాంధీ… గాంధీలు ఎవరికీ క్షమాపణలు చెప్పరు” అని అన్నారు. ఈ వ్యాఖ్యలు బీజేపీ సహా కొన్ని వర్గాలకు కాస్త ఇబ్బంది కరంగా మారాయి.

 

 

Read more RELATED
Recommended to you

Latest news