ప్రతి రాష్ట్రంలో తెలంగాణ మాదిరిగా వైన్స్ షాపుల్లో రిజర్వేషన్లు కల్పించాలి : మంత్రి శ్రీనివాస్‌

-

హైదరాబాదులోని రవీంద్ర భారతిలో రాష్ట్ర ప్రభుత్వం – బీసీ సంక్షేమ శాఖ అధ్వర్యంలోసర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సభ నిర్వహించారు. పాపన్న చిత్రపటానికి మంత్రి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బెల్టుషాపులను వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. బెల్టుషాపుల రద్దుపై గ్రామాల్లో జరుగుతున్న ధర్నాలపై మాత్రం మాట్లాడలేదు. తెగించి కోట్లాడి బహుజన రాజ్యం స్థాపించారన్నారు. దోపిడీ వ్యవస్థను వ్యతిరేకంగా పోరాడి బహుజన రాజ్యస్థాపనచేసిన వ్యక్తి పాపన్నగౌడ్ అన్నారు.

గౌడ జాతిఐక్యతకు కేంద్రబిందువు పాపన్న అని కొనియాడారు. చెట్లపెంపకంలో ఇబ్బందులు ఉన్నా ముందుకు సాగుతున్నామన్నారు. దేశంలో ఏరాష్ట్రంలో లేని విధంగా గౌడ్ లకు వైన్స్ లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందన్నారు.కేరళలో సైతం ఆమోదించాలని, ప్రతి రాష్ట్రంలో తెలంగాణ మాదిరిగా వైన్స్ షాపుల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల్లో గౌడ్ లకు ప్రత్యేకంగా ఏమైనా పథకాలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకొస్తే తెలంగాణలోనూ అమలుకు కృషిచేస్తానని హామీ ఇచ్చారు. 15 రోజుల్లో నీరా కేఫ్ ను, గౌడ ఆత్మ గౌరవ భవనాన్ని ప్రారంభించబోతున్నామని స్పష్టం చేశారు. ఇతరులు గౌడవృత్తి చేపట్టకుండా ప్రత్యేక జీవో తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news