మార్చి 30న శ్రీరామనవమి సందర్భంగా హింసాత్మక ఘటనలపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నివేదిక కోరింది. హౌరాలో రామనవమి సందర్భంగా జరిగిన హింసాకాండ పై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మంగళవారం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుండి వివరణాత్మక నివేదికను కోరినట్లు వర్గాలు తెలిపాయి. కేంద్ర హోం మంత్రి అమిత్ షా గవర్నర్ సివి ఆనంద బోస్‌తో మాట్లాడి, రాష్ట్రంలో, ముఖ్యంగా హౌరాలోని హింసాత్మక ప్రాంతాలలో ప్రస్తుత పరిస్థితిని సమీక్షించిన కొద్ది రోజుల తరువాత ఇది జరిగింది.. హౌరాలో రామనవమి సందర్భంగా జరిగిన హింసాకాండ పై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుండి వివరణాత్మక నివేదికను కోరింది.. అసలు ఘటనలు ఏంటో తెలుసుకొని పూర్తి వివరాలను అందించాలని కోరినట్లు సమాచారం..
హౌరాలో రామనవమి రోజున జరిగిన హింసపై హోం మంత్రిత్వ శాఖ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుండి వివరణాత్మక నివేదికను కోరినట్లు వర్గాలు తెలిపాయి. మార్చి 30న ఉత్సవాల సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పలు వాహనాలను తగులబెట్టారని, ఆ ప్రాంతంలో దుకాణాలను ధ్వంసం చేశారని పోలీసులు తెలిపారు.. ఈ హౌరాలో జరిగిన హింసాకాండకు సంబంధించి 30 మందిని అరెస్టు చేశారు..ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..