పాలకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో బండి సంజయ్ కి వైద్య పరీక్షలు

-

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని కరీంనగర్ పోలీసులు నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్టు చేసిన విషయం తెలిసిందే. బండి సంజయ్ ని అరెస్ట్ చేసి బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ కి తరలించారు పోలీసులు. అయితే తాజాగా బుధవారం రోజు బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ నుండి బండి సంజయ్ ని పాలకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయనని హనుమకొండ కోర్టులో హాజరు పరిచేందుకు బయటకు తీసుకురాగా.. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బండి సంజయ్ ని తరలించే వాహనం ముందు బిజెపి శ్రేణులు బైఠాయించి నిరసనకు దిగారు.

దీంతో బీజేపీ శ్రేణులను పోలీసులు చెదరగొట్టి హనుమకొండ కోర్టుకు తరలిస్తున్నారు. నేడు కోర్టుకు సెలవు కావడంతో మెజిస్ట్రేట్ ఇంటి ముందు బండి సంజయ్ ని హాజరు పరిచే అవకాశం ఉందని సమాచారం. అయితే వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వాహనాలను మార్చి బండి సంజయ్ ని పోలీసులు తరలిస్తున్నారు. బండి సంజయ్ తరలింపులో పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపట్ల బీజేపీ శ్రేణులు గందరగోళానికి గురవుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news