బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు రాష్ట్రంలో పెను దుమారం రేపింది. అయితే పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ వెనుక బీజేపీ హస్తం ఉందని.. ముఖ్యంగా పేపర్ లీకేజీకి పాల్పడిన ఉపాధ్యాయులు బండి సంజయ్కు తెలిసిన వారేనని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పేపర్ లీకేజీకి పాల్పడి విద్యార్థుల భవిష్యత్తో చెలగాటమాడుతున్నారని బీఆర్ఎస్ మంత్రులు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. తాజాగా ట్వీట్ చేశారు. పిచ్చోని చేతిలో రాయి ఉంటే వచ్చి పోయేటోళ్లకే ప్రమాదమని.. పిచ్చోని చేతిలో పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదమని కేటీఆర్ అన్నారు. స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నాపత్రాలు లీకు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు.
అమాయక విద్యార్ధుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పిచ్చోని చేతిలో రాయి ఉంటే..
వచ్చి పోయేటోళ్ళకే ప్రమాదం…!!కానీ
అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే
ప్రజాస్వామ్యానికే ప్రమాదం…!!!తమ స్వార్థ రాజకీయాల కోసం
ప్రశ్నా పత్రాలు లీకు చేసి అమాయకులైన విద్యార్ధుల, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న బీజేపి నాయకులు #BJPleaks https://t.co/8GFI6ups6v— KTR (@KTRBRS) April 5, 2023