బండి సంజయ్ అరెస్ట్ లో పోలీసులు రూల్స్ మరిచారా ?

-

ఈ రోజు ఉదయం తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు చెలరేగుతున్నాయి. ఒకవైపు బీజేపీ ప్రజాప్రతినిధులు ఏ కారణం చెప్పకుండా ఎందుకు అరెస్ట్ చేస్తారు అంటూ ఫైర్ అవుతుంటే, బి ఆర్ ఎస్ నేతలు ఈ కామెంట్ లకు కౌంటర్ లు ఇస్తున్నారు. ఇక సాయంత్రానికల్లా మొత్తం అన్ని విషయాలు బయటకు రావడంతో బీజేపీ ప్రజాప్రతినిధులు కాస్త వెనక్కు తగ్గారని చెప్పాలి. బండి సంజయ్ ఫోన్ కు పేపర్ ఫోటో రావడమే అరెస్ట్ కారణం అయింది. కాగా ఈ విషయాన్ని ఈ రోజు లోక్ సభలో పార్లమెంట్ లోపల మరియు బయట బీజేపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఈ అరెస్ట్ చట్టవ్యతిరేకంగా జరిగిందంటూ స్పీకర్ కు కంప్లైంట్ చేశారు. మాములుగా ఒక విధానం ప్రకారం పార్లమెంట్ మెంబెర్ ను అరెస్ట్ చేస్తే ముందుగా లోక్ సభ స్పీకర్ కు ఖచ్చితంగా సమాచారం అందించాల్సి ఉంది. కానీ ఈ విషయంలో పోలీసులు చట్టప్రకారం నడుచుకోలేదని క్లియర్ గా అర్ధమవుతోంది అంటూ బీజేపీ ఎంపీలు స్పీకర్ కు నోటీసులు ఇచ్చారు. మరి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఎలా స్పందిస్తారు అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news