కేతిరెడ్డి..ఓ అవినీతి అనకొండ – నారా లోకేష్‌ ట్వీట్‌

-

కేతిరెడ్డి..ఓ అవినీతి అనకొండ అంటూ సంచలన ట్వీట్‌ చేశారు టీడీపీ పార్టీ నేత నారా లోకేష్‌. గుడ్ మార్నింగ్ అంటూ ధ‌ర్మ‌వ‌రంలో గుట్ట‌లు, పొలాలు, చెరువుల్ని మింగేస్తున్నారు అవినీతి అనకొండ ఎమ్మెల్యే రంగ మార్తాండ కేతిరెడ్డి అంటూ ఫైర్‌ అయ్యారు నారా లోకేష్‌. ముదిగుబ్బ మండ‌లంలో రూ.60 కోట్ల విలువైన 30 ఎక‌రాల‌ను ఎమ్మెల్యే రైట్ హ్యాండ్ నారాయ‌ణ‌రెడ్డి గ్యాంగ్ క‌బ్జా చేశారు.

ఇదిగో గుడ్ మార్నింగ్ మాటున చేస్తున్న కేటు ప‌నుల‌కి ఆధారాలు. ఎప్పుడు రిజైన్ చేస్తావు? అని నిలదీశారు. చిత్రావ‌తి న‌ది ఉప్పల‌పాడు రీచ్ నుంచి ఎమ్మెల్యే కేతిరెడ్డి ముఠా ఇసుక అక్ర‌మంగా త‌ర‌లించే టిప్పర్లూ ఈ రోజూ క‌నిపించాయి. కృష్ణంరెడ్డిపల్లి వ‌ద్ద జ‌రిగిన ముఖాముఖిలో మహిళల ఆవేద‌న విన్నాను, టిడిపి ప్ర‌భుత్వం వ‌చ్చాక స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రిష్క‌రిస్తామ‌ని భ‌రోసా ఇచ్చానంటూ ట్వీట్‌ చేశారు లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Latest news