నా ముందు ఎలాంటి ఆప్షన్స్ లేవు – కోమటిరెడ్డి

-

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తీరుపై తీవ్ర మనస్థాపంతో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి పార్టీని వీడడం కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారని, ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారని, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే తనపై ఫేక్ న్యూస్ ప్రసారం అవుతుందని తెలిపారు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.

నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను పార్టీ మారుతున్నారని వస్తున్న వార్తలను నమ్మవద్దని సూచించారు. తాను ఎక్కడ పార్టీ కార్యక్రమాలకు దూరంగా లేనని, మొన్న రాహుల్ గాంధీ అనర్హతను నిరసిస్తూ గాంధీభవన్ లో దీక్షలో పాల్గొన్నానని తెలిపారు. అలాగే భువనగిరి నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలలో పాల్గొంటున్నానని.. తన ముందు ఎలాంటి ఆప్షన్స్ లేవని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news