SBI సూపర్ స్కీమ్..రూ.7 లక్షలు రిటర్న్స్.. స్కీమ్ వివరాలు..

-

కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య పొదుపు పొదుపు పథకాలపై వడ్డీని పెంచిన సంగతి తెలిసిందే..ఇప్పుడు పొదుపు పథకలాను తీసుకొనేవారికి ఎన్నో బెనిఫిట్స్ కూడా ఉన్నాయి..సుకన్య సమృద్ధి యోజన సహా పలు పథకాల వడ్డీ రేట్లను పెంచింది కేంద్ర ప్రభుత్వం. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వడ్డీ రేటు 70 బేసిస్ పాయింట్స్ పెరిగింది. 100 బేసిస్ పాయింట్స్ 1 శాతంతో సమానం. 7 శాతంగా ఉన్న వడ్డీ రేటు 7.7 శాతానికి పెరిగింది.

ఇక కొత్త వడ్డీ రేటు 2023 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది. 2023 జూన్ 30 వరకు ఇదే వడ్డీ రేటు ఉంటుంది. అంటే ఈ మూడు నెలల్లో ఈ స్కీమ్‌లో డబ్బులు దాచుకున్నవారికి 7.7 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది.. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ పాపులర్ స్కీమ్. ఎందుకంటే ఎలాంటి రిస్క్ లేకుండా రిటర్న్స్ ఇచ్చే పథకం ఇది. సాధారణంగా ఏ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్‌లో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలన్నా ఎంతో కొంత రిస్క్ తప్పదు. కానీ రిస్కు లేకుండా మంచి రిటర్న్స్ పొందాలంటే పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న పొదుపు పథకాల్లో నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ కూడా ఒకటి..

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ పథకంలో ఒకేసారి డబ్బు పొదుపు చేయాల్సి ఉంటుంది. కనీసం రూ.1,000 జమ చేయొచ్చు. గరిష్ట పరిమితి లేదు. ఈ స్కీమ్‌లో ఎవరైనా చేరొచ్చు. మైనర్ల పేరు మీద పెద్దవాళ్లు అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం ఉంది. జాయింట్ అకౌంట్ కూడా ఓపెన్ చేసి డబ్బులు దాచుకోవచ్చు. ఎప్పుడు పొదుపు చేసినా రిటర్న్స్ కోసం ఐదేళ్లు వేచి ఉండాలి. మెచ్యూరిటీ సమయంలో అసలుతో పాటు వడ్డీ కూడా వస్తుంది..ఇకపోతే ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం లెక్కేస్తే ఈ స్కీమ్‌లో రూ.1,000 ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్ల తర్వాత రూ.1,403 రిటర్న్స్ వస్తాయి. అంటే రూ.1,00,000 ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్ల తర్వాత రూ.1,40,300 రిటర్న్స్ వస్తాయి. ఈ లెక్కన మీరు రూ.5,00,000 ఇన్వెస్ట్ చేస్తే ఐదేళ్ల తర్వాత రూ.7,01,500 రిటర్న్స్ పొందొచ్చు.అలాగే పన్ను మినహాయింపు కూడా పొందోచ్చు
.

Read more RELATED
Recommended to you

Latest news