మహిళల కోసం కేంద్రం కొత్త స్కీమ్… పన్ను ప్రయోజనాలు కూడా..?

-

కేంద్రం ఇప్పటికే ఎన్నో పథకాల్ని తీసుకొచ్చింది. తాజాగా దేశంలోని మహిళలు, బాలికల కోసం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ లో కొత్త పథకాన్ని తీసుకు వచ్చింది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్ పేరు తో రెండేళ్ల కాలపరిమితి పథకాన్ని కేంద్రం తీసుకొచ్చింది. ఇక పూర్తి వివరాలు చూస్తే.. దీని ద్వారా స్థిరమైన వడ్డీ వస్తుంది. ఈ కొత్త స్మాల్ సేవింగ్స్ స్కీమ్‌ ని తీసుకు రావాలని మార్చి 31, 2023న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం.

ఇక ఈ స్కీమ్ సెక్షన్ 80సీ కిందకు వస్తుందా..? లేదా అనేది చూద్దాం. ఇందులో పెట్టుబడి పెడితే సెక్షన్ 80సీ కింద రిబేట్ వస్తుందా? అని కూడా అంతా అడుగుతున్నారు. ఏప్రిల్ 5న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ని ఈ మేరకు రిలీజ్ చేసింది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీకింద పన్ను రాయితీ కిందకు రాదని స్పష్టం చేసింది. ఈ స్కీమ్ తో వచ్చే వడ్డీ కి ట్యాక్స్ కట్టాలి. ఒకే స్కీములో
పెట్టుబడి రూ.2 లక్షలు, దాని పై వడ్డీ 7.5 శాతం సైతం ట్యాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్ పరిధిలోకి రాదు.

మీ ట్యాక్స్ స్లాబ్, ఇతర ఎఫ్‌డీల వడ్డీ ఆదాయాన్ని బట్టీ ఇది ఉంటుంది. మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ ద్వారా వచ్చే వడ్డీపైన పన్ను చెల్లించాలి. రూల్4 (l) ప్రకారం పెట్టుబడి గరిష్ఠ పరిమితి మైనర్ల విషయం లోనూ పెరగదు. మైనర్ గర్ల్ పేరు తో అయితే గరిష్ఠంగా రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. ఈ స్కీమ్ లో వెయ్యి నుండి పెట్టుబడి మొదలు పెట్టచ్చు. రూ.1000 మల్టిప్లైస్ తో పెంచుకోచ్చు. గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళచ్చు. ఈ పథకం వార్షిక వడ్డీ రేటు 7.5 శాతంగా ఉంది. రెండేళ్ల తర్వాత ఫామ్-2 ద్వారా డబ్బు తీయచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news