న‌ర్స‌రీ నుంచే చిన్నారుల‌కు ప‌రీక్ష‌లు, గ్రేడ్‌లు.. ఎక్క‌డో తెలుసా..

-

సాధార‌ణంగా పాఠశాలలో విద్యార్థులు పోటీ ప‌డుతుంటార‌న్న విష‌యం మనందరికీ తెలుసు. అయితే వారి తెలివితేటలను నిరూపించడానికి, విద్యార్థులు ప్రతి సంవత్సరం మొదటి రెండవ మరియు మూడవ స్థానాలకు పోటీపడతారు. కానీ హైదరాబాద్‌లో.. ప్రియా భారతి హైస్కూల్‌లోపాఠశాలలో నర్సరీ టాపర్స్ జాబితాలో 10 మంది విద్యార్థులు, ఎల్‌కేజీ టాపర్ జాబితాలో 14 మంది విద్యార్థులు, యూకేజీ టాపర్స్ జాబితాలో 11మంది మరియు మొదటి తరగతికి 9 మంది టాపర్లు ఫ‌స్ట్ క్లాస్‌లో పాస్ అయ్యార‌ట‌.

అయితే ఆ స్కూల్ యాజ‌మాన్యం ఏకంగా ఆ చిన్నారుల ఫోటోలు మ‌రియు వారి గ్రేడ్‌ల‌తో స‌హ బిల్‌బోర్డ్‌ను పెట్టి నెటిజ‌న్ల విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను ఓ నెటిజన్‌ ట్విటర్‌లో పంచుకోవడంతో ఇది వెలుగులోకి వచ్చింది. అప్పట్నుంచి ఇది విపరీతంగా వైరల్‌ అవుతోంది. నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ పిల్లల్ని విద్యార్థులుగా భావించరనే విజ్ఞత కూడా లేదంటూ నెటిజన్లు సదరు పాఠశాల యాజమాన్యం మీద మండిప‌డుతున్నారు. అలాగే వారి మార్కెట్ పెంచుకోవ‌డానికి పిల్ల‌లు వ‌స్తువులు కాద‌ని ఫైర్ అవుతున్నారు. కానీ దీనిపై స్కూల్ యాజ‌మాన్యం ఇంకా స్పందించ‌క‌పోవ‌డం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news