బీజేపీ ప్రభుత్వంపై, ప్రధాన మంత్రి మోదీపై ట్విటర్ వేదికగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. కేంద్ర సర్కార్ దర్యాప్తు సంస్థలను తన గుప్పిట్లో పెట్టుకుందని ట్వీట్ చేశారు. దర్యాప్తు సంస్థలు కీలుబొమ్మలుగా ఎలా మారాయో దేశం మొత్తం గమనిస్తోందని అన్నారు.
ఈడీ, సీబీఐ ఎలా ప్రేక్షకపాత్ర పోషిస్తున్నాయో ప్రజలు చూస్తున్నారంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘’బీజేపీ‘ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసి.. చాలా అంశాలు బయటపెట్టినందుకు జమ్మూకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌ను అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది. ప్రధాని మోదీకి అవినీతి గురించి మాట్లాడటం చాలా తేలిక. అయితే, కర్ణాటక బీజేపీ ప్రభుత్వ కమీషన్ల వ్యవహారంపై మాత్రం స్పందించరు. అదానీ విషయానికి వస్తే అవినీతిపై ప్రసంగాలు, నిబంధనలు ఏవీ వర్తించవు’’’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
Nation is watching keenly as ED & CBI become mute spectators & mere puppets
I suppose they will now arrest Former Governor Satyapal Ji for the revelations
Talking big on corruption is easy @narendramodi Ji
But when it comes to commissions and omissions of BJP Government in… https://t.co/hohhi2EU7T
— KTR (@KTRBRS) April 13, 2023
మరోవైపు నిన్న ఖమ్మం జిల్లా కారెపల్లి మండలం చీమలపాడులో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన వారిని కేటీఆర్ పరామర్శించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.