ఎన్నికలు దగ్గరపడటంతో కేసీఆర్ కి అంబేద్కర్ గుర్తుకు వచ్చారు – బండి సంజయ్

-

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడడంతో సీఎం కేసీఆర్ కి అంబేద్కర్ గుర్తుకు వచ్చారని విమర్శించారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు తాము (బిజెపి) వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. బిజెపి పోరాటం, ఒత్తిడి వల్లే రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను వేగవంతం చేసి, ప్రారంభోత్సవానికి సిద్ధమైందని అన్నారు. గత ఎనిమిదేళ్లుగా ఏనాడు అంబేద్కర్ సేవలను కెసిఆర్ గుర్తించలేదని మండిపడ్డారు.

చాలాసార్లు నూతన సచివాలయం నిర్మాణ పనులను పరిశీలించేందుకు వెళ్లిన కేసీఆర్.. ఏ ఒక్కరోజు కూడా అంబేద్కర్ నిర్మాణ పనులను ఎందుకు పరిశీలించలేదని ప్రశ్నించారు. దళిత బంధు పథకం నిధులపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించే అర్హత సీఎం కేసీఆర్ కు లేదన్నారు బండి సంజయ్. కెసిఆర్ దళిత ద్రోహి అంటూ వ్యాఖ్యానించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పిన కేసీఆర్.. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news