రాజమౌళి ఖాతాలో మరో రికార్డ్.. వరల్డ్ టాప్ 100లో నిలిచిన దర్శక ధీరుడు

-

తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లిన దర్శకధీరుడు రాజమౌళి మరో ఘనతను సొంతం చేసుకున్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆర్ఆర్అర్ సినిమాని తీసుకువెళ్లి ఆస్కార్ సొంతం చేసుకున్న ఈ దర్శకుడు తాజాగా ప్రతిష్టాత్మకమైన టైం మ్యాగజైన్ విడుదల చేసిన వరల్డ్ లో 100 మోస్ట్ ప్రభావవంతులైన వ్యక్తుల జాబితాలో చోటు దక్కించుకున్నారు.

భారతీయ సినిమాని హాలీవుడ్ స్థాయికి తీసుకువెళ్లిన ఘనత రాజమౌళిదే. ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఆస్కార్ సొంతం చేసుకొని భారతీయ సినీ పరిశ్రమకే గర్వకారణంగా నిలిచారు. ముఖ్యంగా ఈ సినిమాలో నాటు నాటు పాట గోల్డెన్ గ్లోబ్ లో అవార్డును సొంతం చేసుకోవడంతో పాటు ఆస్కార్ అవార్డును సైతం గెలుచుకుంది. ఈ విజయంతో రాజమౌళితో పాటు ఎన్టీఆర్ రామ్ చరణ్ సైతం అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు సంపాదించుకున్నారు. కాగా ఈ సినిమాతో ఇప్పటికే ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన రాజమౌళి తాజాగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రభావితమైన వారిలో టాప్ 100 జాబితాలో చోటు సంపాదించుకున్నారు. కాగా ఈ జాబితాలో ఇండియా తరుపున చోటు దక్కించుకున్న తొలి ఫిలిం మేకర్ గా రాజమౌళి రికార్డు సాధించారు. ఈ విషయాన్ని డివిడి ఎంటర్టైన్మెంట్ ట్విట్టర్ వేదికగా తెలిపింది. దీంతో రాజమౌళికి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.

కాగా ఈ జాబితాలో మరో ఇండియన్ గా షారుఖ్ ఖాన్ చోటు దక్కించుకున్నారు. మార్గదర్శకులు జాబితాలో రాజమౌళికి స్థానం దక్కగా ఐకాన్స్ జాబితాలో షారుఖ్ టాప్ 100లో నిలిచారు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు ప్రపంచ వ్యాప్తంగా సాగే సాహస యాత్రికుడిగా కనిపించాను అన్నట్టు తెలుస్తోంది ఈ సినిమాతో మరోసారి రాజమౌళి రికార్డుల బద్దలు కొట్టి హాలీవుడ్ కూడా తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news