దర్శకుడు లింగుస్వామి కి ఆరు నెలలు జైలు శిక్ష.

-

ప్రముఖ తమిళ దర్శకుడు నిర్మాత లింగుస్వామికి మద్రాస్ కోర్టు ఆరు నెలల శిక్ష విధించింది. చెక్ బౌన్స్ కేసులో శిక్ష విధిస్తూ మద్రాస్ ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది.

ప్రముఖ దర్శకుడు లింగస్వామి కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హీరోయిన్ సమంత, కార్తీ జంటగా ఓ సినిమాను తీయడానికి సన్నాహాలు చేశారు. ఈ సినిమాకి దర్శక నిర్మాతగా ఆయనే వ్యవహరించాలనే ఉద్దేశంతో చిత్ర నిర్మాణం గురించి 2014లో పీవీపీ క్యాపిటల్ లిమిటెడ్ నుండి రూ. 1.03 కోట్లు రుణంగా తీసుకున్నారు. అయితే చిత్ర నిర్మాణం జరగలేదు. అప్పు చెల్లింపులో భాగంగా పీవీపీ సంస్థకు చెక్ ఇచ్చారు. లింగుస్వామి ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో పీవీపీ సంస్థ కోర్టును ఆశ్రయించింది. ఈ విచారణ అనంతరం సైదాపేట్ కోర్టు లింగుస్వామికి ఆరు నెలలు జైలు శిక్ష విధించింది. దీన్ని సవాల్ చేస్తూ లింగు స్వామి మద్రాసు ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. ఇరు వర్గాల వాదనలు విన్న మద్రాస్ ప్రిన్సిపుల్ సెషన్స్ కోర్టు సైతం అదే తీర్పు వెలువరించింది. లింగస్వామి కి ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువడించింది.

Lingusamy | Deccan Chronicle

కాగా లింగు స్వామి 2001లో తమిళ చిత్రం ఆనందం తో దర్శకుడు అయ్యాడు. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. రన్, పందెంకోడి, అవారా వంటి సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించి స్టార్ డైరెక్టర్ గా మారాడు. వీటి అనంతరం పందెంకోడి 2 సినిమాని తర్కెక్కించిన ఈ సినిమా పెద్దగా విజయం సాధించలేదు అనంతరం ఇటీవలే రామ్ పోతినేని తో దివారియర్ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయాన్ని పొందలేదు.

Read more RELATED
Recommended to you

Latest news