అంబేద్కర్ రాజ్యాంగం రాష్ట్రంలో అమలు కావడంలేదు – చాడ వెంకటరెడ్డి

-

బిజెపి హఠావో- దేశ్ కి బచావో అనే నినాదంతో జిల్లాల వ్యాప్తంగా సీపీఐ ఆధ్వర్యంలో ప్రజాచైతన్య యాత్ర నిర్వహిస్తున్నారు. చేర్యాల, కొమురవెళ్లి మండలాల్లో నిర్వహిస్తున్న ఈ ప్రజా చైతన్యయాత్రలో పాల్గొన్నారు జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ రాసిన రాజ్యాగం రాష్ట్రంలో అమలుకావడం లేదన్నారు. ప్రధానమంత్రి ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలు అమలు చేయడం లేదని మండిపడ్డారు.

దేశంలోనే సంపన్నుడైన ఆదాని 3లక్షల వేల కోట్లు బ్యాంక్ లకు బకాయి ఉన్నా.. వారిపై కఠిన చర్యలు తీసుకోవడం లేదని.. ఎందుకంటే ఇద్దరు గుజరాతీలేనని విమర్శించారు. కేంద్రం బిఎస్ఎన్ఎల్, ఎల్.ఐ.సి, విద్యుత్ వంటి సంస్థలను ప్రవేటికరణ చేస్తూందని ఆరోపించారు చాడా వెంకట్ రెడ్డి. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకుండా కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలపై భారం మోపుతుందన్నారు. అధికారంలోకి రావడానికి బిజెపి మతోన్మాద రాజకీయాలు చేస్తుందని తీవ్ర విమర్శలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news