టాలీవుడ్ ను వదలని బాలీవుడ్ స్టార్స్..!

-

ఒకప్పుడు టాలీవుడ్ అంటేనే చిన్నచూపు చూసిన బాలీవుడ్ ఇప్పుడు టాలీవుడ్ ని వదలడం లేదని తెలుస్తోంది. ఎందుకంటే టాలీవుడ్ సినిమాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పాకి పోతుంటే బాలీవుడ్ సినిమాలు మాత్రం అట్టడుగుకి వెళ్ళిపోతున్నాయి. ఇకపోతే ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్స్ రాబట్టి పాన్ ఇండియా చిత్రాలుగా ఆకట్టుకున్నది ఒక్క దక్షిణాది చిత్రాలే అని చెప్పాలి. అలాంటి వాటిలో కేజిఎఫ్, బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప , కాంతారా వంటి సినిమాలు సృష్టించిన సెన్సేషన్ అంతా కాదు.

ముఖ్యంగా దక్షిణాది చిత్రాలపై నార్త్ ఇండియన్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే సౌత్ మార్కెట్ పై దృష్టి పెడుతున్నారని చెప్పాలి. కేవలం హీరో గానే కాకుండా విలన్ గా కూడా మెప్పించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కేజిఎఫ్ సినిమాతో ప్రతి నాయకుడిగా మెప్పించారు సంజయ్ దత్. ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమాతో సైఫ్ అలీఖాన్ కూడా తెలుగుతరకు పరిచయం కానున్నాడు. అలాగే బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కూడా తెలుగులో వినయ్ విధేయ రామ సినిమాలో విలన్ గా కనిపించారు.

మరొకవైపు కేజీఎఫ్ 2 లో కూడా సంజయ్ దత్ అధీరా పాత్ర పోషించి అందరిని అలరించాడు. వివేక్ ఒబెరాయ్ మరొకవైపు అజిత్ నటించిన తమిళ సినిమాలో కూడా నటించాడు. ఇక ఈ క్రమంలోనే ప్రస్తుతం లోకేష్ కనకరాజన్ దర్శకత్వంలో విజయ దళపతి నటిస్తున్న లియో చిత్రంలో కూడా సంజయ్ దత్ ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. సల్మాన్ ఖాన్ వంటి హీరోలు కూడా తెలుగు సినిమాలలో గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తున్న విషయం తెలిసిందే.అందుకే తెలుగు సినిమాలలో క్రేజ్ కోసం బాలీవుడ్ నటులు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news