వివేకా కేసులోకి వైఎస్ భారతి పేరు ఎందుకు లాగుతున్నారు? – వైసీపీ ఎమ్మెల్సీ

-

వివేకా కేసులోకి వైఎస్ భారతి పేరు ఎందుకు లాగుతున్నారు? అని ఆగ్రహించారు వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత. చంద్రబాబు ఫోర్ ట్వంటీ రాజకీయాలు మానుకోవాలని.. పెయిడ్ ఆర్టిస్ట్ పట్టాభి ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నావని ఫైర్‌ అయ్యారు. చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకుని పట్టాభి స్థాయి మరిచి పోయి మాట్లాడుతున్నాడని ఓ రేంజ్‌ లో ఫైర్‌ అయ్యారు.

రాజకీయాల్లోకి వైఎస్ భారతి పేరు ఎందుకు లాగుతున్నారు?? అని ఆగ్రహించారు. చంద్రబాబు మైండ్ గేమ్ ఆడుతున్నాడని ఫైర్‌ అయ్యారు. ఒక సంఘటన జరిగినప్పుడు ఫోన్ చెయ్యడం సహజం అన్నారు. వివేక గుండెపోటుతో చనిపోయాడని అప్పటి మంత్రి ఆదినారాయణ రెడ్డి చెప్పాడని వివరించారు. వివేకా చనిపోయినప్పుడు చంద్రబాబు అధికారంలో ఉండి ఏమి చేశాడు ? అని ప్రశ్నించారు వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత.

 

Read more RELATED
Recommended to you

Latest news