పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి.. రూ.6,000 పొందే ఛాన్స్..?

-

ఈ మధ్యకాలంలో నకిలీ వార్తలు విపరీతంగా వస్తున్నాయి. ఇటువంటి నకిలీ వార్తలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేకపోతే అనవసరంగా మోసపోవాల్సి ఉంటుంది. బ్యాంకుల పేరుతో తరచు మనకి ఎన్నో మెసేజ్లు వస్తూ ఉంటాయి ఇటువంటి వాటితో జాగ్రత్తగా లేకపోతే అకౌంట్ ఖాళీ అయిపోతుంది. తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త వస్తోంది. మరి అది నిజమా కాదా అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

దిగ్గజ బ్యాంకుల్లో ఒకటైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ 130వ వార్షికోత్సవం సందర్భంగా ఆరువేల రూపాయలని పొందే అవకాశాన్ని ఇస్తున్నట్టు ఒక వార్త వచ్చింది. మరి నిజంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ 130వ వార్షికోత్సవం సందర్భంగా 6000 రూపాయలు పొందొచ్చా..? క్వషినేర్ ద్వారా 6000 రూపాయలు పొందచ్చంటూ వస్తున్న వార్తలో నిజం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. 6000 రూపాయలు విలువ చేసే ఫైనాన్షియల్ సబ్సిడీని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇస్తోందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ వస్తున్న వార్త వట్టి నకిలీ వార్త మాత్రమే.

ఇందులో ఎలాంటి నిజం లేదు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎలాంటి లక్కీ డ్రా ని కూడా కండక్ట్ చేయడం లేదు. ఇది వట్టి నకిలీ వార్త అని తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఈ వార్త ప్రస్తుతం షికార్లు కొడుతోంది దీని నమ్మితే అనవసరంగా మీరే నష్టపోవాల్సి ఉంటుంది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కూడా దీనిపై స్పందించింది. ఇది నకిలీ వార్త అని తేల్చి చెప్పేసింది కాబట్టి అనవసరంగా ఇటువంటి నకిలీ వార్తలని నమ్మి మోసపోకండి.

Read more RELATED
Recommended to you

Latest news