తెలంగాణలో ఇవాళ కూడా భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నిన్నటిలాగే ఈరోజు కూడా తూర్పు తెలంగాణలో భారీ ఉపరీతల ద్రోని కనిపిస్తుంది. బలమైన ఉరుములు, గాలులు మరియు కొన్ని వడగళ్ళ వర్షాలు ఉత్తర, మధ్య తెలంగాణలో మధ్యాహ్నం సమయంలో ఏర్పడతాయి.
తర్వాత ఇవి సాయంత్రం – రాత్రి సమయంలో తూర్పు తెలంగాణ లోని భద్రాద్రి – కొత్తగూడెం, ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి లో విస్తరిస్తాయి. హైదరాబాద్ లో ఈరోజు చెదురుమదురు వర్షాలు సాయంత్రం – రాత్రి సమయంలో ఉంటాయి. రానున్న రోజులలో మరిన్ని తీవ్రమైన అకాల వర్షాలు తెలంగాణ లో ఉంటాయి, రైతులు అప్రమతంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది.