విరూపాక్ష: మొదటివారం ఎంత కలెక్షన్ చేసిందో తెలుసా..?

-

కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ హీరోగా , సంయుక్త మీనన్ హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం విరూపాక్ష.. బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. అంతేకాదు కలెక్షన్ల పరంగా కూడా దూసుకుపోతోంది ఈ సినిమా. ఇకపోతే శుక్రవారం రోజు థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా అటు ఆడియన్స్ ను ఇటు క్రిటిక్స్ ను కూడా అలరించింది ఈ నేపథ్యంలోని ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ షేర్ ఎంత అనేది ట్రేడ్ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.

ఇకపోతే వారాంతంలో ఈ సినిమా ఎంత కలెక్షన్ వసూలు చేసిందో ఇప్పుడు చూద్దాం.

నైజాం : రూ.7.2 కోట్లు
వైజాగ్ : రూ.2.05 కోట్లు
సీడెడ్ : రూ.2.31 కోట్లు
గుంటూరు : రూ.1.19 కోట్లు
నెల్లూరు : రూ.0.56 కోట్లు
కృష్ణ : 0.93 కోట్లు
వెస్ట్ గోదావరి : 0.85 కోట్లు
ఈస్ట్ గోదావరి : రూ.1.1 కోట్లు
ఆంధ్ర తెలంగాణ కలిపి : రూ.16.19 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా : రూ.1.4 కోట్లు
ఓవర్సీస్ రూ.3 కోట్లు
ప్రపంచవ్యాప్తంగా – రూ.20.59 కోట్లు
ప్రీ రిలీజ్ బిజినెస్ : రూ.25 కోట్లు

ఇకపోతే ఈ సినిమా అఫీషియల్ స్ట్రీమింగ్ హక్కులు అయితే దిగ్గజ ఓ టి టి యాప్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇక మీ చివరి వారంలో కానీ జూన్ మొదటి వారంలో కానీ ఈ సినిమా ఓటీటీ లో స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. ఇకపోతే ఈ సినిమా హారర్ త్రిల్లర్ జోనర్ను ఇష్టపడే వారికి విపరీతంగా నచ్చుతుంది అలాగే బిగ్ స్క్రీన్ మీద చూస్తే విరూపాక్ష మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుందనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news