నిన్న ఉదయం తెలంగాణ పోలీసులకు మరియు వైఎస్ షర్మిలకు మధ్య జరిగిన గొడవలో అనుకోకుండా షర్మిల పోలీసుపై చెయ్యి చేసుకోవడంతో వివాదం పెద్దదిగా మారింది. డ్యూటీ లో ఉన్న పోలీస్ పై చెయ్యి చేసుకోవడం తప్పన్న విషయం తెలిసిందే. ఈ కారణంగా షర్మిలను అరెస్ట్ చేసి నాంపల్లి కోర్ట్ లో ప్రవేశ పెట్టారు. ఈ కోర్ట్ లో మేజిస్ట్రేట్ ఈమె చేసింది తప్పేనని నమ్మి చంచల్ గూడ జైలుకు 14 రోజుల రిమాండ్ ను విధిస్తూ తీర్పును ఇచ్చారు. కాగా నిన్ననే షర్మిల తరపు లాయర్లు బెయిల్ కు పిటిషన్ పెట్టడంతో ఈ రోజు మధ్యాహ్నం ఆమెకు బెయిల్ మంజూరు అయింది.
విడుదలైన షర్మిల తనపై పోలీసులు పాల్పడిన చర్యను చెప్పుకుని బాధపడ్డారు. ఈమె మాట్లాడుతూ కనీసం మహిళ అన్న జ్ఞానం కూడా లేకుండా బూటు కాలితో తొక్కారు ఈ పోలీసులు అంటూ ఆవేదన చెందారు. తమ ఆత్మరక్షణ కొరకే నేను పోలీసులను తోశానన్నారు.