కేసీఆర్ పొలిటికల్ విజయ్ మాల్యలా తయారయ్యారు – బూర నర్సయ్య గౌడ్

-

సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు మాజీ ఎంపీ, బిజెపి నేత బూర నర్సయ్య గౌడ్. కేసీఆర్ కేంద్రంపై విమర్శలు చేస్తున్నాడని.. అధికారం అన్ని రోజులు మీకే ఉండదన్నారు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకో కేసీఆర్.. ప్రజలు ఓట్లేస్తే హీరోలు.. లేదంటే జీరోలని అన్నారు. మీరు ఇప్పటికే అభద్రతా భావంలో ఉన్నారనేది అందరికీ తెలుసన్నారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామో..? లేదో..? తమ ఉనికికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని భయపడుతున్నారని.. అందుకే రాత్రికి రాత్రి జీవోలు వస్తున్నాయని ఆరోపించారు.

ఔరంగాబాద్ సభకు భారీగా యాడ్స్ ఇచ్చారని.. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు యాడ్స్ ఇస్తున్నారని మండిపడ్డారు. ప్రజల సొమ్మును పంచుతున్నారని విమర్శించారు బూర నర్సయ్య గౌడ్. కేసీఆర్ పొలిటికల్ విజయ్ మాల్యాలాగా తయారయ్యారని ఆరోపించారు. రాయల తెలంగాణ అని ఒక ఏపీ నేత అంటున్నాడని.. ఇది ఏపీలో ఓట్లు పొందాలని కేసీఆర్ చేస్తున్న మోసంలాగా అనిపిస్తోందన్నారు. తెలంగాణ తల్లిని మోసం చేశారు.. ఇప్పుడు తెలుగు తల్లిని మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. బిఆరెస్ నిర్వహించేది ఆత్మీయ సమ్మేళనాలు కాదు.. ఆత్మ వంచన సభలు అన్నారు బూర నర్సయ్య గౌడ్.

Read more RELATED
Recommended to you

Latest news