ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు గంట ఆలస్యంగా విడుదల కానున్నాయి. హెలికాఫ్టర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తిన కారణంగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆలస్యంగా విజయవాడకు చేరుకోనున్నారు. సీఎం వైఎస్ జగన్‌తో పాటు కలిసి వస్తున్న బొత్స సత్యనారాయణ గంట ఆలస్యంగా విజయవాడ చేరుకుంటారు. దాంతో సాయంత్రం 5 గంటలకు విడుదల కానున్న ఇంటర్మీడియట్ ఫలితాలు.. ఓ గంట ఆలస్యంగా సాయంత్రం 6 గంటలకు వెలుబడనున్నాయి.
దీంతో ఫలితాలను సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేయనున్నారు. దాదాపు పది లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. విద్యార్థులు bieap.apcfss.in. ap. అధికారిక వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఇతర వెబ్ సైట్ లలోను ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఏపీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 15వ తేదీ నుండి ఏప్రిల్ 3వ తేదీ వరకు, సెకండ్ ఇయర్ పరీక్షలు మార్చి 16 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు నిర్వహించారు.