షర్మిల ఏపీలోనూ పోటీ చేయాలి – రఘురామ

-

చనిపోయిన వ్యక్తి తిరిగివచ్చి తనని తాను సమర్ధించుకోలేడని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతారా అంటూ వై.యస్. షర్మిల గారు చేసిన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నట్లు రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు. వివేకానంద రెడ్డి గారి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న సాక్షి దినపత్రిక, ఛానల్ పై ఆమె పరోక్షంగా మండిపడ్డారని, ఎక్కడో ఉన్న షేక్ షమీంను బయటకు తీసుకొచ్చి వై.యస్. షేక్ షమీం రెడ్డి గా మార్చారని, ఆమె బహాటంగా మాట్లాడింది లేదని, అయినా కేసు వేస్తుంది అంటూ తప్పుడు ప్రచారాన్ని చేశారని అన్నారు.

వై.యస్. వివేకానంద రెడ్డి గారి హత్య కేసు లచ్చమ్మ కుటుంబ సభ్యులపైకి రాకుండా ఉండేందుకే ఇదంతా చేస్తున్నారని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలకు, షర్మిల గారు దీటైన వ్యాఖ్యలను చేశారని, వివేకానంద రెడ్డి గారు తన యావత్ ఆస్తిని తన కూతురు, మనవడు మనవరాలు పేరిట రాశారని, ఆస్తి కోసమే హత్య అయితే, డాక్టర్ సునీత గారిని రాజశేఖర్ రెడ్డి గారు హత్య చేయాలి, కానీ వివేకానంద రెడ్డి గారిని డాక్టర్ సునీత, రాజశేఖర్ రెడ్డి గారు హత్య చేశారని పేర్కొనడం ఇదేమి సంస్కారం అంటూ షర్మిల మండిపడ్డారని వెల్లడించారు. షర్మిల గారు తన పార్టీ పేరును వై.యస్.ఆర్. తెలుగు పార్టీ గా మార్చుకొని ఆంధ్రాలోనూ కార్యకలాపాలను చేపట్టాలని స్థానికులు కోరుతున్నారని ఆయన వెల్లడించారు. షర్మిల ఏపీలోనూ పోటీ చేయాలని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news