ఉద్యోగాలు పోతాయేమోనని.. విద్యార్థులకు ఏఐ భయం.. సర్వేలో వెల్లడి

-

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగులనే కాదు టెక్ విద్యార్థులనూ భయపెడుతోంది. ఏఐ వల్ల ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందన్న ఆందోళన టెక్ విద్యార్థుల్లో ఎక్కువగా ఉందని ఓ సర్వే వెల్లడించింది. ఏఐ సంబంధిత నైపుణ్యాలను నేర్చుకోలేకపోతే తమ వృత్తి జీవితంపై ప్రభావం చూపుతుందేమోనని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారని డిజిట్‌ రీసెర్చ్‌ లాబ్‌ నిర్వహించిన సర్వే పేర్కొంది. 3,500 మంది టెక్‌ రంగ యువ వృత్తినిపుణులు, విద్యార్థులతో ఇటీవల సర్వే నిర్వహించింది.

ఆ సర్వే ఏమంటోందంటే..

  • 59% మంది ఏఐను అటు అవకాశంగా.. ఇటు ప్రమాదకారిగా భావిస్తున్నారు.
  • 11 శాతం మంది కచ్చితంగా అది ప్రమాదమేనని.. పోటీ పెరిగి.. ఉద్యోగం పోయే అవకాశం ఉందని అనుకుంటున్నారు.
  • ఏఐ ప్రమాద స్థాయి ఎక్కువగా ఉండొచ్చన్న భావన 40% విద్యార్థుల్లో , 36% మంది వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌లో ఉంది.
  • చాట్‌జీపీటీ వంటి జనరేటివ్‌ టూల్స్‌తో 67% మంది అత్యంత పరిచయం కలిగి ఉండగా.. 23% మంది మోస్తరుగా తెలుసుకున్నారు. 10% మంది వాటి గురించి తెలుసుకోలేదు.
  • ఏఐ, మెషీన్‌ లెర్నింగ్‌, తదితర కొత్త తరం సాంకేతికత నేర్చుకోకపోతే వృత్తి జీవితంలో ఎదుగుదలపై ప్రభావం పడుతుందని 75% మంది విశ్వసిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news