దెయ్యాల నిలయంగా మారిన పాఠశాల..? రెండేళ్లలో ఐదుగురు టీచర్లు మృతి

-

ఈ రోజుల్లో దెయ్యాలు ఉన్నాయని ఎంత మంది నమ్ముతున్నారో.. అవి లెవ్వు అంతా ట్రాష్‌ అనే వాళ్లు కూడా అంతే మంది ఉన్నారు. కొన్నిసార్లు ఈ మూఢనమ్మకాలు ప్రజల ప్రాణాల మీదకు తీసుకువస్తాయి. మీకు తెలిసే ఉంటుంది.. దెయ్యం భయంతో ఒక రైల్వేస్టేషన్‌ దాదాపు నాలుగు దశాబ్ధాలు మూతపడింది.. ఇది కూడా అలాంటిదే.. ఆ పాఠశాలలో దెయ్యాలు ఉన్నాయన్న భయంతో స్కూల్‌ మూతపడింది.. ఇప్పటికి రెండేళ్లు అయింది.. సరస్వతీ దేవి నిలయం దెయ్యాల అడ్డాగా మారిందా..? మార్చేశారా..లేక ఒట్టి పుకారేనా..? అసలు ఇదెక్కడ జరిగిందో చూద్దాం.!!

మధ్యప్రదేశ్‌లోని ఆ సరస్వతీ చదువుల కొలువు… భయాలకు కేరాఫ్ అడ్రెస్ అయ్యింది. ఆ స్కూల్‌కి వెళ్లడం సంగతేమో.. అసలు అటుగా వెళ్లేందుకు కూడా జనాలు వణికిపోతున్నారు.. విద్యార్థులే కాదు.. ఉపాధ్యాయులు సైతం.. ఆ స్కూల్‌కి వెళ్లట్లేదు. విద్యార్థులంతా తప్పనిసరిగా పాఠశాలకు హాజరుకావాలని నిబంధన ఉన్నా ఎవ్వరు రావడం లేదు.. రెండేళ్లుగా ఇదే పరిస్థితి.

ఐదుగురు టీచర్లు మృతి..

మహేంద్ర గఢ్‌లోని ఆ స్కూల్‌లో ఏమైంది అని ప్రశ్నించగా గ్రామస్తులు చెప్పిన విషయాలు షాక్‌కు గురిచేశాయి.. ఆ స్కూల్‌లో రెండేళ్ల కాలంలో.. ఐదుగురు టీచర్లు చనిపోయారు. స్కూల్‌కి వచ్చే ప్రతీ టీచరూ చనిపోతుండటంతో… ఇక ఆ స్కూల్‌కి వెళ్లేందుకు కొత్త టీచర్లు ధైర్యం చేయడం లేదు.అదే సమయంలో తమ పిల్లల్ని ఆ స్కూల్‌కి పంపేందుకు తల్లిదండ్రులు కూడా భయపడుతున్నారు. అందుకే రెండేళ్లుగా ఆ స్కూల్ మూతపడింది.

భరత్‌పూర్ జిల్లా సావ్లా గ్రామ పంచాయతీ బాసెల్‌పూర్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల. అక్కడి ఆవరణలో దెయ్యాలు తిరుగుతున్నాయని ప్రజలు అంటున్నారు. ఎవరు నమ్మినా, నమ్మకపోయినా ఇది నిజం అంటున్నారు. అధికారిక లెక్కల ప్రకారం చూస్తే… పాఠశాలలో పనిచేసిన ఐదుగురు ఉపాధ్యాయులు వేర్వేరు కారణాలతో మృతి చెందారు. స్థానికులు మాత్రం… ఇదంతా దెయ్యాల వల్లే అని బలంగా నమ్ముతున్నారు..

ఒక్కో మృతికి ఒక్కో కారణం..

టీచర్లలో ఒకరైన శంబిహారి… హఠాత్తుగా, కారణం తెలియకుండా మరణించారు. మరో టీచరైన వీరేందర్‌ సింగ్‌… బ్రెయిన్‌ హెమరేజ్‌తో మరణించారు. ఇక చంద్రప్రకాశ్‌ పైక్రా అనే మరో టీచర్… ఇంట్లో నిద్రలోనే మృతి చెందారని అధికారులు అంటున్నారు. ఇలా ఒక్కొక్కరి మరణానికీ ఒక్కో కారణం ఉంటోంది.

కానీ ఆ వ్యక్తి స్కూల్లోనే ఉంటున్నాడు..

ఒక్క వ్యక్తి మాత్రం ఈ మూఢనమ్మకాన్ని ఖండిస్తూ.. ధైర్యంగా స్కూల్ దగ్గరే ఉంటున్నాడు. అతను ఆ స్కూల్ ప్యూన్. నేను చాలా ఏళ్లుగా ఇక్కడే పనిచేస్తున్నాను. రెండేళ్లుగా స్థానికులు ఈ దెయ్యాల మూఢనమ్మకంతో ఉంటున్నారు. నేను మాత్రం దాన్ని ఒప్పుకోను అని ఆయన తెలిపారు. అటు సైన్స్, ఇటు నమ్మకం మధ్య ఆ స్కూల్ మగ్గిపోతోంది. ప్రభుత్వం, అధికారులు కూడా ఈ సమస్యను పెద్దగా పట్టించుకోకండా వదిలేశారు

Read more RELATED
Recommended to you

Latest news