తెలంగాణ మంత్రి వర్సెస్ ఏపీ మంత్రి..మళ్ళీ ఏదో ప్లాన్ చేశారు.!

-

రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు బాగానే సఖ్యతగా ఉంటున్న విషయం తెలిసిందే..అటు కే‌సి‌ఆర్, ఇటు జగన్ సన్నిహితంగానే ఉంటున్నారు. కానీ అప్పుడప్పుడు మాత్రమే రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఓ చిన్నపాటి యుద్ధ వాతావరణం నెలకొని ఉంటుంది. కాకపోతే తెలంగాణ మంత్రులు..ఏదొక విధంగా ఏపీపై కామెంట్ చేయడంతో  రచ్చ మొదలవుతుంది. తెలంగాణ కే‌సి‌ఆర్ ఆధ్వర్యంలో బాగా అభివృద్ధి చెందుతుందని, ఏపీలో రోడ్లు కూడా సరిగ్గా లేవని తెలంగాణ మంత్రులు కామెంట్లు చేస్తూనే ఉన్నారు.

అటు ఏపీ మంత్రులు సైతం..తెలంగాణ మంత్రులకు కౌంటర్లు ఇస్తూ ఉంటారు. ఇలా ఇరు రాష్ట్రాల మధ్య పంచాయితీ నడుస్తూ ఉంటుంది. అయితే ఎవరి రాష్ట్రంలో వారు రాజకీయంగా లబ్ది పొందడానికి ఇలా అప్పుడప్పుడు రచ్చ క్రియేట్ చేస్తుంటారనే విమర్శలు వస్తున్నాయి. ఇటీవల కే‌సి‌ఆర్ ..బి‌ఆర్‌ఎస్ పార్టీని ఏపీలో కూడా పెట్టారు. అక్కడ నుంచి పెద్ద రచ్చ జరుగుతూనే ఉంది. ఈ మధ్య హరీష్ రావు..ఏపీలో అభివృద్ధి లేదని విమర్శలు చేయడం, ఆయనకు ఏపీ మంత్రులు కౌంటర్లు ఇచ్చిన విషయం తెలిసిందే.

తాజాగా తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఏపీ రాజకీయాలపై కామెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పట్టించుకునేది కేసీఆర్ మాత్రమేనని, పోలవరం కట్టేది, విశాఖ ఉక్కు పరిశ్రమలు కాపాడేది కూడా కేసీఆర్ అని అన్నారు. ఇక ఏపీలో కుల రాజకీయాలు నడుస్తున్నాయని, అక్కడ ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం పూర్తిగా మానేసిందని.. కమ్మ, కాపు, రెడ్డి అంటూ ఏపీలో అందరూ కుల రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

ఇక మల్లారెడ్డికి ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కౌంటర్ ఇచ్చారు.. మల్లారెడ్డి ఏపీ వచ్చి చూడాలని, పోలవరం ప్రాజెక్ట్, విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి తెలంగాణ మంత్రులు మాట్లాడకపోవడమే మంచిదని, ఏపీలో జగన్ పాలనలో సామాజిక న్యాయం అమలవుతుందన్నారు. అయితే ఇలా ఇరు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల యుద్ధం జరగడంపై మళ్ళీ విశ్లేషకులు డౌట్ పడుతున్నారు. ఏదో రచ్చ క్రియేట్ చేయడానికి ప్లాన్ చేశారని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news