పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదు.. అందుకే రాజీనామా : బాలినేని

-

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మూడు రోజులక్రితం రాజీనామా చేసిన  విషయం తెలిసిందే. పార్టీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ బాధ్యతల నుంచి తాను తప్పుకున్నట్లు బాలినేని వెల్లడించారు. దీంతో శ్రీనివాస్ రెడ్డి పార్టీ పదవి నుంచి తప్పుకోవడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ నేపధ్యం లో నేడు పార్టీపై అలకబూనిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డిని.. పార్టీ అధిష్టానం బుజ్జగించటం మొదలుపెట్టింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో సీఎం జగన్ భేటీ అయ్యారు. భేటీలో భాగంగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి పలు కీలక విషయాలను వెల్లడించినట్టు సమాచారం.

Who Are The Big Leaders Insulting Balineni Srinivas Reddy?

ముందుగా రీజనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేయటంపై ఆయన ముఖ్యమంత్రికి కారణాలను తెలియచేశారు. పార్టీలో తనకు ప్రాధాన్యత దక్కడం లేదని బాలినేని ఆవేదన వ్యాల్తాపరిచారు. దీంతో బాలినేనిని సముదాయించేందుకు సీఎం జగన్ తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలో రాజీనామాను ఉపసంహరించుకోవాలని బాలినేనిని ముఖ్యమంత్రి జగన్ కోరారు. అయినా కూడా ముఖ్యమంత్రి ఎంతసేపు సముదాయించినా బాలినేని మాత్రం మెత్తబడలేదని సమాచారం. రీజనల్ కోఆర్డినేటర్‌గా కొనసాగేది లేదని బాలినేని సీఎం జగన్‌కు తేల్చి చెప్పేసారు ఆయన.

 

 

Read more RELATED
Recommended to you

Latest news