హాట్ సీటుగా పాలేరు..షర్మిలకు కష్టమే.!

-

షర్మిల : ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం..మొన్నటివరకు దీని గురించి పెద్ద చర్చ లేదు..కానీ ఎప్పుడైతే వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల..ఇక్కడ పోటీ చేస్తానని చెప్పారో అప్పటినుంచి పాలేరు పై పెద్ద చర్చ నడుస్తోంది. అక్కడ గెలుపోటములపై ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అయితే పాలేరు మొదట నుంచి కాంగ్రెస్ కంచుకోట..అలాగే మధ్య మధ్యలో కమ్యూనిస్టులు కూడా సత్తా చాటారు.

పాలేరులో మొత్తం 7 సార్లు పాలేరులో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సి‌పి‌ఎం రెండుసార్లు, సి‌పి‌ఐ ఒకసారి గెలిచింది. అలాంటి స్థానంలో 2016 ఉపఎన్నికలో బి‌ఆర్‌ఎస్ నుంచి తుమ్మల నాగేశ్వరరావు గెలిచారు. అయితే మళ్ళీ 2018 ఎన్నికల్లో పాలేరుని కాంగ్రెస్ సొంతం చేసుకుంది. కానీ కాంగ్రెస్ నుంచి గెలిచిన ఉపేందర్ రెడ్డి..బి‌ఆర్‌ఎస్ లోకి జంప్ చేశారు. దీంతో బి‌ఆర్‌ఎస్ లో గ్రూపు తగాదాలు మొదలయ్యాయి. అదే పార్టీలో తుమ్మల, ఉపేందర్ వర్గాల మధ్య రచ్చ నడుస్తోంది. నెక్స్ట్ ఎన్నికల్లో ఈ సీటు దక్కించుకోవాలని ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు.

అయితే కే‌సి‌ఆర్ ..ఇంకా పాలేరు సీటుని ఫిక్స్ చేయలేదు. సరే ఎవరు బరిలో ఉన్నా ఈ సారి..పాలేరులో బి‌ఆర్‌ఎస్ కు గెలుపు అవకాశాలు తక్కువే. అటు కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేస్తారో క్లారిటీ లేదు. ఇటు షర్మిల పోటీకి సిద్ధమయ్యారు. బి‌జే‌పికి ఇక్కడ బలం లేదు. దీంతో పాలేరులో త్రిముఖ పోరు జరగనుంది. బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్, షర్మిల మధ్య పోరు జరుగుతుంది.

కానీ గెలుపు ఎవరిదనేది చెప్పలేని పరిస్తితి. షర్మిలకు నియోజకవర్గంపై పూర్తి పట్టు లేదు. రెడ్డి ఓటర్లు, క్రిస్టియన్, వైఎస్సార్ అభిమానుల ఓట్లపైనే షర్మిల ఆశలు పెట్టుకుంది. ఆ ఓట్లే కాంగ్రెస్ పార్టీకి కీలకం. ఇక ఇక్కడ కమ్యూనిస్టులకు కాస్త బలం ఉంది..వారు బి‌ఆర్‌ఎస్ తో కలుస్తున్నారు కాబట్టి ఆ పార్టీకి కాస్త ప్లస్. కాకపోతే ఒకరికి సీటు ఇస్తే మరొక వర్గం సహకరించే పరిస్తితి బి‌ఆర్‌ఎస్ లో లేదు. అటు కాంగ్రెస్ ఓట్లు షర్మిల చీల్చేలా ఉన్నారు. దీంతో పాలేరులో టఫ్ ఫైట్ నడిచేలా ఉంది. మరి ఈ పోరులో ఎవరు గెలుస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news