ఐపీఎల్ 2023: రెండు రోజులుగా ఆరోగ్యం బాగాలేకున్నా అదరగొట్టిన సూర్య కుమార్ యాదవ్ !

-

నిన్న మొహాలీలో జరిగిన ముంబై మరియు పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ ఎంతో ఉత్సాహాన్ని ప్రేక్షకులకు అందించింది. మొదట టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. బదులుగా పంజాబ్ నిర్ణీత ఓవర్ లలో 214 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఈ విజయంలో ముఖ్య పాత్ర పోషించిన వారిలో ఇషాన్ కిషన్ మొదటి స్థానంలో నిలిచాడు. ఇతను కేవలం 41 బంతుల్లో 75 పరుగులు చేశాడు.

ఆ తర్వాత మనము చెప్పుకోవాల్సింది సూర్య కుమార్ యాదవ్ గురించి.. గత రెండు రోజులుగా సూర్య కుమార్ యాదవ్ అనారోగ్యంతో బాధపడుతున్నాడట, కానీ ముంబై ఫిజియో ల కారణంగా కోలుకుని ఆడానని చెప్పుకొచ్చాడు. ఈ ఇన్నింగ్స్ లో సూర్య 31 బంతుల్లో 66 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Read more RELATED
Recommended to you

Latest news