తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలకు ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ లు విడుదల అవుతాయా అంటూ లక్షల సంఖ్యలో నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు. నోటిఫికేషన్ పడిన వెంటనే ఒక్కో ఉద్యోగం కోసం 100 ల సంఖ్యలో దరఖాస్తులు నమోదు అవుతున్నాయి. అయితే ఇటీవల విడుదల అయిన గ్రూప్ 4 కు సంబంధించిన 8 వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ ప్రక్రియ జరుగుతోంది. అయితే తాజాగా ఈ నోటిఫికేషన్ కు సంబంధించి కీలక ప్రకటన TSPSC చేసింది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే సమయంలో అభ్యర్థులు తెలిసి లేదా తెలియక తప్పులు చేసి ఉంటే ఆ అప్లికేషన్ లు TSPSC రద్దు చేస్తుంది.
అందుకే అలా జరగకుండా ఉండాలి అని TSPSC ఆ తప్పులను సవరించుకునే అవకాశమని కల్పించింది. ఇందుకు రేపటి నుండి ఆన్లైన్ లో ఎడిట్ ఆప్షన్ ను TSPSC కల్పించనుంది. కాబట్టి ఈ ఉద్యోగాలకు అప్లై చేసిన అభ్యర్థులు అంతా రేపటి నుండి 15 గా తేదీ వరేకు సర్దుబాటు చేసుకోవచ్చని తెలిపింది. కాగా ఈ ఎడిట్ ఆప్షన్ కూడా కేవలం ఒక్కసారి మాత్రమే వాడుకోవడానికి అవకాశం ఉంటుందట. మరి జాగ్రత్తగా ఈ ఛాన్స్ ను వాడుకోవాలని అభ్యర్థులకు సూచించింది.