ఆయుర్వేదం ప్రకారం.. మిగిలిన ఆహారాన్ని ఎన్నిగంటల్లో తినాలి..?

-

ఆయుర్వేదం: మన దేశంలో.. వంట చేసేప్పుడు ప్రతి మహిళ.. ఒక ముద్ద మిగిలినా పర్వాలేదు.. చాలి చాలకుండా మాత్రం వండొద్దు అనుకుంటారు.అందుకే.. ఎప్పుడు ఏది వండినా కాస్త మిగిలిపోతుంది. మనం దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని అయిపోయే వరకూ తింటూనే ఉంటాం.. ఇది ప్రతి ఇంట్లో జరిగే విషయమే. అయితే ఇలా మిగిలిపోయిన ఆహారాన్ని ఎన్ని గంటల్లోపు తినాలో ఆయుర్వేదం మనకు వివరిస్తోంది. దాని తాజాదనం, రుచి ఆహారం ఎంతవరకు నిలుపుకుంటుందో ఆ సమయంలోపే తినాలి.. తాజాదనం పోతే ఆ పాత ఆహారం అనారోగ్యాలకు కారణం అవుతుంది.

 

సైన్స్ ప్రకారం.. మిగిలిపోయిన ఆహారాన్ని 15 సెకండ్ల పాటు అధిక ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తే చాలు, ఆహారంలో ఉన్న వ్యాధికారక బ్యాక్టీరియాను చంపవచ్చు. మళ్లీ ఫ్రష్‌గా అవుతుంది.. అయితే ఆయుర్వేదం ప్రకారం… వండిన ఆహారాన్ని మూడు గంటల్లోపు తింటే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆ తర్వాత పోషక విలువలు తగ్గే అవకాశం ఉంది. ఇక మిగిలిపోయిన ఆహారాన్ని అయితే 24 గంటల్లోపు తినాలి. 24 గంటల తరువాత నిల్వ ఉన్న ఆహారాన్ని తింటే వాటిలోని పోషకాలు తగ్గిపోతాయి. అంతేకాదు అలాంటి ఆహారంలో బ్యాక్టీరియా అభివృద్ధి చెందడం మొదలైపోతుంది. ఈ మిగిలిపోయిన ఆహారాన్ని మళ్లీ వేడిచేసినా కూడా ఆ బ్యాక్టిరియా పోయే అవకాశం లేదు. ఇలాంటి ఆహారాన్ని తినడం వల్ల అజీర్ణం, ఉబ్బరం, శరీరంలో దోషాలు వచ్చే అవకాశం ఉంది.

దీర్ఘకాలంగా ఇలా మిగిలిపోయిన ఆహారాన్ని తినేవారిలో పేగు ఆరోగ్యం ప్రభావితం అవుతుంది. పేగు రోగాలు వచ్చే అవకాశం ఉంది. ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం.. ఆహారాన్ని శీతలీకరించి, మళ్లీ వేడి చేయడం వల్ల ఆహారంలోని పోషక విలువలు తగ్గతాయి…కాబట్టి తాజాగా తయారు చేసిన ఆహారాన్ని మూడు గంటల్లోపు తినేయాలి. తాజా ఆహారం ప్రాణాన్ని పోషిస్తుంది. జీర్ణంలోని వేడిని పెంచుతుందని ఆయుర్వేదంలో నమ్ముతారు. ఎప్పుడైనా సరే.. ఆహారాన్ని మళ్లీ వేడి చేస్తున్నారంటే.. అది మీకు గ్యాస్‌, అజీర్తి సమస్యలను తెచ్చిపెడుతుంది. మాంసం, పాలతో చేసిన వంటకాలు, సముద్ర ఆహారం వంటివి నిల్వ చేయకుండా తినేయడమే మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news