ఈ రోజు సాయంత్రం ఐపీఎల్ షెడ్యూల్ లో భాగంగా పంజాబ్ కింగ్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్యన మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే వార్నర్ సారధిగా ఉన్న ఢిల్లీ జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు దాదాపుగా సన్నగిల్లిపోయాయి. అయితే ఇప్పుడు ఢిల్లీ ఇతర జట్ల అవకాశాలను కాపాడడమా లేదా చెడగొట్టడమా మాత్రమే చేయగలదు. ఇక పంజాబ్ విషయానికి వస్తే ఆరంభం లో వరుసగా మూడు మ్యాచ్ లు మంచి ఊపుమీద ఉన్నట్టు కనిపించిన అనంతరం పూర్తిగా ట్రాక్ తప్పిపోయి వరుసగా ఓటములను ఎదుర్కొంది. ఇప్పుడు మిగిలిన మూడు మ్యాచ్ లను భారీ తేడాతో గెలిస్తేనే ప్లే ఆఫ్ అవకాశాలు మిగులుతాయి. ఇక శిఖర్ ధావన్ జట్టులో కొన్ని మార్పులు చేయాల్సి ఉంది.
రానున్న మూడు మ్యాచ్ లకు మాత్యు షార్ట్ ను జట్టులో ఆడించాలి, వరుసగా విఫలం అవుతున్న రాజపక్సను పక్కన పెట్టాలి. బౌలింగ్ లోనూ రబడా ను ఆడించాలి. ఇక బ్యాటింగ్ ఆర్డర్ లో కూడా బ్యాటింగ్ అయితే ఒక విధంగా మరియు ఛేజింగ్ అయితే మరో విధంగా కొన్ని మార్పులు చేస్తే ఉపయోగం ఉంటుంది.