ఐపీఎల్ మ్యాచ్ లో గాయపడ్డ లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ కోలుకుంటున్నారు. మూడు రోజుల క్రితం విజయవంతంగా ఆపరేషన్ పూర్తికాగా, తాజాగా చేతి కర్రల సహాయంతో నడుస్తున్న ఫోటోను షేర్ చేశారు. తన భార్యతో కలిసి షాపింగ్ వెళ్ళినట్లు ఫోటోల ద్వారా తెలుస్తుంది. అయితే గాయం కారణంగా రాహుల్ డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ కు దూరం అయ్యారు.
కాగా, నేను ఐపీఎల్ లో రెండు మ్యాచ్లు జరగనున్నాయి. మధ్యాహ్నం మూడు గంటలకు RR, ఆర్సిబి జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇరుజట్లు విజయంపై కన్నెశాయి. RR 12 పాయింట్లతో, ఆర్సిబి 10 పాయింట్లతో ఉన్నాయి. మరోవైపు సాయంత్రం కేకేఆర్, సీఎస్కే మధ్య మ్యాచ్ జరగనుంది. మరో విజయంతో ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకోవడంపై సీఎస్కే దృష్టి పెట్టింది.